గృహణ నిర్మాణ సంస్థ కార్యాలయావరణలో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం
1 min read
చీపురు పట్టి పరిసరాలను శుభ్రం చేసిన,పిడి,మేనేజర్, డిఇ,జెఇ మరియు సిబ్బంది
పరిసరాల పరిశుభ్రత తడి చెత్త,పొడిచెత్త పై సిబ్బందికి అవగాహన
పల్లెవెలుగు , ఏలూరుజిల్లా ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ-దివస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రీ సెల్వి ఆదేశాల అనుసారం జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రత పచ్చదనం, తడిచెత్త,పొడిచెత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ కార్యాలయ ఆవరణలో హౌసింగ్ పీడీ జి సత్యనారాయణ పర్యవేక్షణలో సిబ్బందితో చీపురు పట్టి పరిశుభ్రత పచ్చదన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేస్తూ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదారం చేసి పరిశుభ్ర ఆంధ్ర ప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ. ఈరోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ,ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు మా వంతు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ సంస్థ మేనేజర్ ఎండి షరీఫ్, డిఇ రామకృష్ణ, జేఇ సిహెచ్ సురేష్, వీరవెంకయ్య మరియు హౌసింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
