NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

1 min read

తడి చెత్త-పొడి-చెత్త వేరు చేయుటపై అవగాహన

స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ గా నా వంతు కృషి చేస్తాని ప్రమాణం

మండల పరిషత్ అధికారి శ్రీనివాసరావు, పంచాయతీ ఇవో శివకుమార్ గౌడ్

పల్లెవెలుగు, ప్యాపిలీ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన స్వర్ణ ఆంధ్ర,స్వచ్చ ఆంధ్ర  కార్యక్రమంలో భాగంగా ప్యాపిలీ పట్టణంలోని మేజర్ గ్రామపంచాయతీ  కార్యాలయాం నుంచి జాతీయ రహదారిపై నుండి ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ గాంధీ సర్కీల్ దగ్గర ప్రభుత్వ అధికారులు, గ్రామపంచాయతీ సిబ్బంది, విద్యార్థులు ప్రతిజ్ఞ నిర్వహించారు.అనంతరం పరిశుభ్రత పచ్చదనం, తడిచెత్త,పొడిచెత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం ఎంపిడిఓ శ్రీనివాస రావు అధ్వర్యంలో ఎంపీడీవో  కార్యాలయ ఆవరణలో  పర్యవేక్షణలో సిబ్బందితో చీపురు పట్టి పరిశుభ్రత పచ్చదన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయ పరిసర ప్రాంతాలను సిబ్బందితో కలిసి చీపురుతో ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం ప్రతిజ్ఞ చేస్తూ నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని, నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదారం చేసి పరిశుభ్ర ఆంధ్ర ప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ. ఈరోజు నుండి నాతోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం పై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ,ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు మా వంతు కృషి చేస్తామని ప్రమాణం చేస్తున్నామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తోప్పల శ్రీనివాసులు,పంచాయతీరాజ్ ఎఇ ప్రభాకర్, హౌసింగ్  ఎఇ వెంకటేశ్వర్లు,ఎపిఓ వెంకటరమణ, మరియు పంచాయతీ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *