పాతబడిన నీళ్ల ట్యాంక్ ను కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగింపు
1 min read
పల్లెవెలుగు ,హొళగుంద : కర్నూలు జిల్లా హోళగుంద మండలం కోగిల తోట గ్రామంలో ఎంపీయుపి స్కూల్ ఆవరణంలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న నీళ్ల ట్యాంకు పాతబడిపోవడంతో అది ఏ సమయంలోనైనా స్కూల్లో చదువుకునే విద్యార్థినీ,విద్యార్థినీయులు ఆడుకునే సమయంలో ఎప్పుడైనా కూలిపోయి అక్కడున్న విద్యార్థులప్రాణాలకు బలి కావచ్చు… అందువలన దీనిని ముందుగానే గ్రహించిన ఎస్ఎంసి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు దీనిని ఎలాగైనా స్కూల్ ఆవరణంలో నుంచి తొలగించేయాలి అనుకుని జిల్లా కలెక్టర్కు అర్జీ పెట్టుకోవడం జరిగింది.. దానికి స్పందించిన జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష వెంటనే ఆ నీళ్ల ట్యాంకును తొలగించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.. దీంతో అక్కడున్న ఆ నీళ్ల ట్యాంకును గ్రామపంచాయతీ సెక్రెటరీ నాగరాజు,గ్రామ సర్పంచ్ నాగప్ప నాయుడు, మరియు ఎస్ఎంసి చైర్మన్ బసవరాజు ఆధ్వర్యంలో ఆదివారం దానిని తొలగించడం జరిగింది.