ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు వైవి రావు సేవలు అభినందనీయం
1 min read
ఏపీ జెఎసి అమరావతి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కె రమేష్ నివాళులు
ఆయన స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఏలూరు రీజియన్ చైర్మన్ కె.వి.రాఘవులు పిలుపు
పల్లెవెలుగు, ఏలూరుజిల్లా ప్రతినిధి: ఏపీఎస్ఆర్టీసీలో కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో పోరాడిన ఏపీపిటిడి ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా ఏపీ జేఏసీ అమరావతి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వై వి రావు సేవలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఏపీ పిటిడి ఏలూరు రీజియన్ చైర్మన్ కెవి రాఘవులు పిలుపునిచ్చారు. వై వి రావు ద్వితీయ వర్ధంతి సభ స్థానిక ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం కపర్ది భవనంలో ఎంప్లాయిస్ యూనియన్ రీజనల్ చైర్మన్ కె.వి రాఘవులు అధ్యక్షతన సోమవారం జరిగింది. వై వి రావు చిత్రపటానికి ఏపీ జెఎసి అమరావతి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ కె రమేష్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు పుష్ప మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. వై వి రావు చిత్రపటానికి ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ చైర్మన్ ఎమ్మెస్ రావు, ఏలూరు రీజియన్ కార్యదర్శి బి రాంబాబు, కోశాధికారి జి భాస్కరరావు, ఏలూరు డిపో ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి డి ఆంజనేయులు, జంగారెడ్డిగూడెం డిపో ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి జె ఎస్ నారాయణ, నూజివీడు డిపో ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి వి వి కుమార్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వై.యస్, భాస్కర్, జి రాంబాబు, స్వామి, బి. వి. రావు తదితరులు పుష్పాలు వేసి జోహార్ తప్పించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ కె రమేష్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఎంప్లాయిస్ యూనియన్ ఏలూరు రీజియన్ కార్యదర్శి బి రాంబాబు మాట్లాడుతూ వై వి రావు ఆర్టీసీలో కార్మికుల, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. ఏపీ జెఎసి అమరావతిలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జాయిన్ అయిన తర్వాత ఏపీ జెఎసి అమరావతికి జనరల్ సెక్రెటరీగా వైవి రావు పనిచేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల కోసం, 11వ పి ఆర్ సి అమలు కోసం జరిగిన ఉద్యమాలలో, పోరాటాలలో ప్రముఖ పాత్ర వహించారని వారు తెలిపారు. వై వి రావు ఉద్యమ స్ఫూర్తిని, పోరాట దీక్షను ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు ఆదర్శంగా తీసుకొని ఎంప్లాయిస్ ను అభివృద్ధికి తద్వారా ఏఐటీయూసీ అభివృద్ధికి కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.
