NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సిఎస్ఆర్ నిధులతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాం 

1 min read

రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్

పల్లెవెలుగు , కర్నూలు : సిఎస్ఆర్ నిధులతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నాం అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్ తెలిపారు.సోమవారం స్థానిక బుధవారపేట, ఇందిరాగాంధీ నగర్ లో కోకా కోలా బెవరేజెస్ కంపెనీ ద్వారా  సిఎస్ఆర్ నిధులతో పునరుద్ధరించిన అంగన్వాడి కేంద్రాలను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టి.జి. భరత్, జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ప్రారంభించారు..ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోకా కోలా బెవరేజెస్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నిధులతో జిల్లాలో పలు రకాల అభివృద్ధి పనులు చేయించడం జరిగిందని తెలిపారు. పలు మల్టీ నేషనల్ కంపెనీలతో సమావేశమైన సందర్భాలలో కర్నూలు జిల్లాలో  సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులను చేపట్టాలని కోరామన్నారు. అందులో భాగంగానే  కోకాకోలా బెవరేజెస్ కంపెనీ ఆధ్వర్యంలో సిఎస్ఆర్ నిధుల కింద 50 లక్షల రూపాయలతో పలు రకాల అభివృద్ధి పనులు చేశారన్నారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో  అదనంగా 2 మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటుతో పాటు, అంగన్వాడి కేంద్రాల అప్గ్రేడేషన్ పనులు చేయడం జరిగిందని.. ఇందుకు మంత్రి కోకా కోలా కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. రాయలసీమ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతమని, ఇక్కడ ఎక్కువ శాతం పరిశ్రమలు వచ్చేందుకు ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు ఆరున్నర లక్షల కోట్ల పైన పెట్టుబడులు తీసుకురావడం జరిగిందన్నారు. దాదాపు 5 సంవత్సరాల్లో చేయాల్సిన పనులు కేవలం 8 నెలల్లోనే చేశామని, దీనికి ముఖ్య కారణం రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబునాయుడు గారు అన్నారు. సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు.జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా  మాట్లాడుతూ కోకా కోలా బెవరేజెస్ కంపెనీ ద్వారా సిఎస్ఆర్ నిధుల కింద 50 లక్షల రూపాయలతో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని సదరం క్యాంప్, ఓపి విభాగం వద్ద 2 మినరల్ వాటర్ ప్లాంట్లు, 2 చెత్త సేకరణ ఎలెక్ట్రిక్  వాహనాలను, అంగన్వాడి భవనాల పునరుద్ధరణ వంటి పలు రకాల అభివృద్ధి పనులను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి మంత్రి కృషి చేస్తున్నారని, రానున్న రోజుల్లో జిల్లాలో మరిన్ని అభివృద్ధి  పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు.తొలుత మంత్రి, కలెక్టర్  బుధవారపేటలోని పునరుద్ధరించిన  అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించి కాసేపు చిన్నారులతో ముచ్చటించారు. అనంతరం కోకా కోలా కంపెనీ  ఆధ్వర్యంలో సేల్స్ అండ్ మార్కెటింగ్,  డిజిటల్ లిటరసీ అంశాల్లో శిక్షణ ఇచ్చిన విద్యార్థులకు, మహిళలకు  సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో కర్నూల్ ఆర్టీవో సందీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, కోకా కోలా కంపెనీ మేనేజర్ ముకుంద్ త్రివేది, తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *