చెత్త తొలగింపు పనులు చేపట్టిన పంచాయతీ అధికారులు
1 min read
హొళగుంద పోలీస్ స్టేషన్ పక్కన చెత్తను తొలగిస్తున్న పంచాయతీ కార్మీకులు
పల్లెవెలుగు హొళగుంద : హొళగుంద మండలం కేంద్రం హొళగుందలోని పోలీస్ స్టేషన్ పక్కన దుర్గంధం వెదజల్లుతున్న చెత్త, మురుగును సోమవారం పంచాయతీ అధికారులు తొలగింపు పనులు చేపట్టారు. గ్రామంలో ఇటీవల జరిగిన సిద్ధేశ్వరస్వామి జాతర సందర్భంగా ఈ స్థలంలో వ్యాపారులు జాయింట్ వీల్, బోటింగ్, ఊయాల తదితర ఆటల సామాగ్రి వేసి వారం రోజుల పాటు వ్యాపారం చేసుకున్న నిర్వాహకులు జాతర అనంతరం అక్కడ చెత్త, మురుగునీరును తొలగించకుండ వెళ్లిపోయారు. దీంతో ఆ ప్రాంతంలో నిల్వ ఉన్న చెత్త, మురుగు చేరి దుర్గంధం వెదజల్లుతుండగ అందులో పందులు, కుక్కలు దొర్లి మరింత కంపు కొట్టేది. పంచాయతీ సెక్రటరి రాజశేఖర్ గౌడ్ వెంటనే స్పందించి పారిశుధ్య నివారణ చర్యలు చేపట్టారు. చెత్తను తొలగించి దోమలు వృద్ధి చెందకుండ హైపో ద్రావణం పిచికారి, బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు.