ప్రభుత్వ ఎస్. సి, .. దామోదరం సంజీవయ్య బాల సదన్ హాస్టల్స్ తనిఖీ
1 min read
పల్లెవెలుగు, కర్నూలు: పెద్దపాడు ప్రభుత్వ ఎస్. సి, మరియు దామోదరం సంజీవయ్య బాల సదన్ హాస్టల్స్ ను తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి. కబర్థి, కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి .జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా జడ్జి శ్రీ జి. కబర్థి ,కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి రాష్ట్ర న్యాయ సేవల అధికారం ఆదేశాల మేరకు సోమవారం పెద్దపాడు నందు గల ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ మరియు దామోదరం సంజీవయ్య బాల సదన్ హాస్టల్స్ ను తనిఖీ చేసి ఆ హాస్ట ల్స్ లోని సౌకర్యాలు, ఆహారం నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకొన్నారు. కార్యాలయాలకు సంబందించిన రిజిస్టర్ లను పరిశీలించారు. ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొనివేళతాము అని తేలేయజేశారు.ఈ కార్యక్రమంలో ఆయా సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.