మళ్లీ వచ్చేది వైయస్సార్ ప్రభుత్వమే
1 min readపత్తికొండ ఎమ్మెల్యే కంగ్రాట్స్ శ్రీదేవి ధీమా
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : ఈసారి ఎన్నికల్లో మళ్లీ వచ్చేది వైయస్సార్ ప్రభుత్వమే అని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బీమా వ్యక్తం చేశారు. శుక్రవారం నియోజకవర్గంలోని మద్దికేర మండలం బురుజుల గ్రామంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచార కార్యక్రమం చేపట్టారు. ఇంటి ముంగిటకే సంక్షేమాన్ని అందించే ప్రజా ప్రభుత్వాన్ని తిరిగి నిలబెట్టుకుందామని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ ఈ సందర్భంగా ఓటర్లకు పిలుపునిచ్చారు. తమ మండలంలో ప్రచారం నిర్వహించడానికి వచ్చిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. గ్రామ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేసి ఫ్యాన్ గుర్తుకే ఓటువేయాలని గ్రామస్తులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగనన్న ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. కుట్రల కూటమి ఎన్ని మోస పూరిత హామీలిచ్చినా వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో మేలు జరిగిఉంటే మరోసారి ఓటువేసి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మద్దికేర మండల, బురుజుల గ్రామం వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.