నాడీ శోధనతో ఆరోగ్య ఖర్చు తగ్గింపు – డా. మాకాల సత్యనారాయణ
1 min read
పల్లెవెలుగు, విజయవాడ: అశోక్ నగర్ లోని ఇండియన్ ఓం కేంద్ర కార్యాలయం వద్ద యోగ శక్తి చికిత్స రూపకర్త మరియు యోగ శక్తి సాధన సమితి వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ మాకాల సత్యనారాయణ ఉచిత నాడీ శోధన కార్యక్రమం నిర్వహించినారు. నాడీ శోధనతో ఆరోగ్య ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపారు .మానవదేహంలోని 12 అవయవాలు పంచభూతాల వలె పని చేస్తాయని వాటిలో హెచ్చుతగ్గులు నాడీ శోధనతో తెలుసుకొని మానవదేహంలోనే ఉన్నా ప్రాణ శక్తి కేంద్రాలను చైతన్య పరచడంతో విరిగినవి, తెగినవి మరియు కుళ్ళినవీ తప్ప మిగతా అనారోగ్యాలను సైతం తగ్గించవచ్చునని తెలిపారు. నాడీ శోధనతో వచ్చిన మూల సమస్యలను గుర్తించి చికిత్స చేయటంతో అతి తక్కువ ఖర్చుతో తెలిసిన వ్యాధులు,తెలియనివి మరియు రాబోయే రుగ్మతలను తగ్గి అసహజ మరణాలు గణనీయంగా తగ్గించవచ్చునని డాక్టర్ మాకాల సత్యనారాయణ తెలిపారు. ఈ ఉచిత ఆరోగ్య శిబిరంలో పలువురు పాల్గొని క్యాంపును సద్వినియోగం పరుచుకున్నారు. ఈ క్యాంపులో ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గోపి సుధా మరియు కొండవీటి సుమతి సేవలు అందించినారు.