NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మడుపల్లి మోహన గుప్త సామాజిక సేవలు అభినందనీయం, ఆదర్శనీయం..

1 min read

మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు

శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం తనపై మరింత బాధ్యతను పెంచింది

పోపూరి లలితకుమారి (వాల్గా)

ప్రతి ఏటా లక్షలాది రూపాయలతో సేవా కార్యక్రమాలు

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: సేవా రంగంలో నగరానికి చెందిన మడుపల్లి మోహన్ గుప్తాది విశేష పాత్రఅని, ప్రతి ఏటా ఆయన కోట్లాది రూపాయల సేవా కార్యక్రమాలకు వినియోగించడం ఆదర్శనీయమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఆదివారం రాత్రి స్థానిక వై ఎమ్ ఎస్ ఏ హాల్ లో ప్రముఖ రచయిత్రి ఓల్గాగా ప్రసిద్ధురా లైన పోపూరి లలితా కుమారికి గుప్తా ఫౌండేషన్ సంస్థ ప్రతిష్టాత్మక అందజేస్తున్న శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కార ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న గంగరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంపాదిస్తారని కానీ కొంతమంది మాత్రమే తమ సంపాదించిన దారిలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారని అన్నారు. మడుపల్లి మోహన్ గుప్తా రెండవ కోవకు చెందిన వారన్నారు. గుప్తా ఫౌండేషన్ స్థాపించి ఆ సంస్థ ద్వారా 2021 నుంచి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆ పన్నులకు సహాయం అందజేసిన మహా మనిషి గుప్తా అన్నారు. ఆయన సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నరు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరో అతిధి ప్రొఫెసర్ చుండూరి మృణాళిని మాట్లాడుతూ గుప్తా ఫౌండేషన్ అందించే శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని అందుకోవడం గొప్ప విషయమని,తాను ఈ పురస్కారాన్ని 2020 సంవత్సరంలో అందుకున్నాను అన్నారు. ఈ ఏడాది పురస్కారానికి రచయిత్రి వోల్గాను ఎంపిక చేయడం సమచితమన్నారు. ఈ సందర్భంగా మడుపల్లి మోహన్ గుప్తా మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో 1994వ సంవత్సరం నుంచి ఈ శ్రీకృష్ణమూర్తి సాహిత్య పురస్కారాన్ని ప్రారంభించామన్నారు. సాహితీ రంగంలో విశేష కృషి చేసిన. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సాహితీవేత్తలకు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నమన్నారు. ఈ పురస్కారాన్ని ఇప్పటివరకు 20 మంది సాహితీ వేత్తలకు అందించమని తెలిపారు. ఈ ఏడాది పురస్కారాన్ని ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్య రంగంపై తనదైన ముద్రవేసిన ఓల్గాకు అందించామన్నారు. తమ సంస్థ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది ఏలూరు నగరంలోని వెంకన్న చెరువు అభివృద్ధికి కోటి రూపాయలు కేటాయించమని, ఈ నిధులతో వచ్చే ఏడాది నాటికి చెరువును అభివృద్ధి చేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఏలూరు జిల్లాలోని జిలుగుమిల్లి మండలం వంకా వారి గూడెంలో వాల్మీకి విజ్ఞాన కేంద్రంలో విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు 40 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశామని. దీనిపై ప్రతినెల వచ్చే వడ్డీతో విద్యార్థులకు పోషకాహారం అందించే ఏర్పాటు చేశామన్నారు. దీనితోపాటు ఏలూరు నగరంలోని గుడ్ సమరిటన్ క్యాన్సర్ ఆసుపత్రికి 15 లక్షల విలువైన అన్ని సౌకర్యాలతో కూడిన అంబులెన్స్ ను ఇదే సందర్భంగా అందజేశామన్నారు. దానితోపాటు ఇదే ఆసుపత్రిలో తల సేమియా వ్యాధిగ్రస్తులకు రక్తమార్పిడి చేయడానికి అవసరమైన మినరల్ వాటర్ అందించడానికి మూడు లక్షలతో నీటి శుద్ధి ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనితోపాటు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆకివీడు మండలంలోని వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం విద్యార్థుల సౌకర్యార్థం నాలుగు లక్షలు విలువైన ఎలక్ట్రికల్ ఆటోను అందిస్తున్నామన్నారు. అనంతరం పురస్కార గ్రహీత ఓల్గా మాట్లాడుతూ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం తనపై మరింత బాధ్యతలు పెంచిందని, సమాజాన్ని మేల్కొలిపే సాహిత్యాన్ని అందించడానికి నిరంతరం కృషి చేయడానికి ఈ పురస్కారం ఒక ప్రోత్సాహకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గుప్త కుటుంబ సభ్యులు సంస్థ ఆడిటర్ డివి సుబ్బారావు,మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *