ఘనంగా శివాజీ జయంతి ఉత్సవం
1 min read
పల్లెవెలుగు ,కర్నూలు: కర్నూల్ నగర శివారులోని విజ్ఞాన పీఠంలో వైభవంగా శివాజీ జయంతి ఉత్సవాలు జరిగాయి.19-2-2025 బుధవారం ఉదయం 10 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నంది రెడ్డి సాయి రెడ్డి మాట్లాడుతూ మనదేశంలో హిందూ పదపాదుషాయిగా, హిందూ హృదయ సామ్రాట్ గా శివాజీ హిందూ రాజ్యాన్ని స్థాపించాడని ,ఎందరో హిందూ రాజులకు శివాజీ ఆదర్శప్రాయుడుగా నిలుస్తాడని తెలియజేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మ ప్రసార్ ప్రముఖ్ శ్రీ అనంత విశ్వప్రసాద్ మాట్లాడుతూ ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్నరోజుల్లో శివాజీ జయంతి నాడు విజ్ఞాన పీఠంలో బోరు పాయింట్ వేయించడం ప్రయాగనుండి గంగమ్మను ఆహ్వానించడమే అని అన్నారు .విజ్ఞాన పీఠం కార్యదర్శి శ్రీ పీ పీ గురుమూర్తి సభాధ్యక్షులుగా మాట్లాడుతూ శివాజీ మహారాజ్ మన కర్నూలు జిల్లాలోని శ్రీశైలానికి విచ్చేసి శ్రీ భ్రమరాంబ దేవి దగ్గర దీక్షను స్వీకరించి చక్రవర్తిగా మారాడని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి శ్రీ మాణిక్య రెడ్డి , శ్రీ ఎస్ రామిరెడ్డి, శ్రీ చంద్రమోహన్, శ్రీ సుదర్శనం ,శ్రీనివాసులు వంటి వారు పాల్గొని ప్రసంగించారు.