ఛత్రపతి శివాజీ హిందువులకు స్పూర్తి కావాలి
1 min read
జయంతి వేడుకలో శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థులు
పల్లెవెలుగు,మంత్రాలయం: ఛత్రపతి శివాజీ హిందువులకు స్పూర్తి కావాలని శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్రతీర్థులు పిలుపునిచ్చారు. బుధవారం ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలో భాగంగా ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో ఛత్రపతి శివాజీ చరిత్ర ఒక ప్రత్యేక అధ్యాయమని హిందు ధర్మ పరిరక్షణకు కృషి చేసిన మహా వీరుడని కొనియాడారు. ప్రజా రంజకంగా రాజ్యాన్ని పరిపాలించి ఆధ్యాత్మికతను కలిగి రాఘవేంద్రస్వామి, ఆశిస్సులు పొందారని సాక్షాత్తు శ్రీ శక్తి మాత నుంచి ఖడ్గం పొందిన ధీరుడు అన్నారు. ఆయన యువతకు స్పూర్తి కావాలని కోరారు. మొదటి సారి యువత ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతిని చేయడం ఆనందంగా ఉందని శ్రీ మఠం నుండి సహకారం అందిస్తామని తెలిపారు. అనంతరం ప్రత్యేక వాహనంలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి డిజె సౌండ్ తో బాణా సంచా పేల్చి సంబరాలతో శ్రీ రామ సర్కిల్, రాఘవేంద్ర సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్ మీదుగా ఊరేగించి 101 కొబ్బరికాయాలు కొట్టారు. ఈ కార్యక్రమంలో జీనియస్ గ్లోబల్ స్కూల్, శ్రీ వైష్ణవి ఇంగ్లీషు మీడియం పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్ రాఘవేంద్ర , వడ్డే నారాయణ , ,వీరారెడ్డి ,మంగళి వెంకటేష్ , కురువ మల్లికార్జున పేగుల రాము హండే భీమేష్ పవన్ కుమార్, రమేష్ వడ్డే శ్రీ రామ్, వడ్డే గురుప్రసాద్, హండే నీలకంఠ, చాకలి సునీల్ ఫణింద్ర చాకలి చక్రవర్తి, ప్రాణేష్, పులకుక్క రాము, హరి గౌడ్ బంగి వీరేష్ దాసప్ప సుధర్మ తదితరులు పాల్గొన్నారు.
