పంచాయితీ కార్యదర్శుల మండల కమిటీ ఎన్నిక..
1 min read
పల్లెవెలుగు, నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పంచాయతీ కార్యదర్శుల నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం నందికొట్కూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం,ఈఓఆర్డి రంగనాయక్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఎన్నిక జరిగింది.గ్రేడ్ 1 నుంచి 6 వరకు ఉన్న పంచాయతీ కార్యదర్శులు నూతన మండల కమిటీ ఎన్నిక వివరాలు: అధ్యక్షులుగా యు.చంద్రశేఖర్ గౌరవ అధ్యక్షులు శాంతయ్య, చెన్నయ్య,గౌరవ సలహాదారులు పి.రవీంద్ర బాబు,ప్రధాన కార్యదర్శిగా ఎం నూరుల్లా,కోశాధికారి సి రాజశేఖర్, ఉపాధ్యక్షులుశరత్ కుమార్,అబ్దుల్ రహీమ్ ఉదయ్ కుమార్ రెడ్డి లను ఎన్నుకున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.తర్వాత నూతన మండల కమిటీ వివరాలను ఎంపీడీవో మరియు ఈఓఆర్డీలకు అందజేశారు.