NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

11కెవి మెయిన్ బజార్,కొత్త వెంకన్న ప్లేడరు మరమ్మతులు

1 min read

ఉదయం 8గం:నుండి మధ్యాహ్నం 2గం:వరకు విద్యుత్ సరఫరానిలుపుదల

వినియోగదారులు సహకరించాలని మనవి

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ యం.కె అంబేద్కర్

పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: ఈనెల 21వ తేదిన ఏలూరు 1 వ పట్టణంలో గల కోటదిబ్బ  సబ్ స్టేషన్ పరిదిలో 11కెవి  మెయిన్ బజార్  ఫీడరు మరియు 11కెవి  కొత్త  వెంకన్న ట్యాంక్   ఫీడర్లకు  లైన్ల  మరమత్తుల  నిమిత్తం ఉదయం 08:00  గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలుపదల చేయబడును. ఈ సమయంలో కోటదిబ్బ సబ్ స్టేషన్ పరిధి లో గల రిక్షా ఘాటి, ఏడు గోలీల సెంటర్,  వేణు గోపాల స్వామి టెంపుల్, విజయ లక్ష్మి థియేటర్, బుద్ధ పార్క్, పంట కాలువ రోడ్డు, టీచర్స్ కాలనీ, కుండి సెంటర్, సెనగపప్పు బజార్ మరియు ఎలక్కయాల సందు  పరిసర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయబడునని ఎపిఇపిడిసిఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆపరేషన్ కె.ఎం. అంబేద్కర్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించవలసినదిగా  కోరారు.

About Author