బాలికలకు సైకిళ్ల పంపిణీ..
1 min read
సంస్థ ప్రతినిధులను అభినందించిన కమతం రాజశేఖర్ రెడ్డి
పల్లెవెలుగు, మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని కలమందల పాడు, దిగువపాడు గ్రామ జిల్లా పరిషత్ పాఠశాల బాలికలకు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు.హైదరాబాదుకు చెందిన డివైన్ వర్డ్ సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ ఫాదర్ ఎం సురేష్ ఆధ్వర్యంలో బుధవారం కలమందల పాడు పాఠశాలలో 12 మంది విద్యార్థులకు ఫాదర్ సురేష్ ఉప్పలదడియ గ్రామ టీడీపీ నాయకులు కమతం రాజశేఖర్ రెడ్డి,వీరారెడ్డి, పాఠశాల హెచ్ఎం మల్లికార్జున నాయక్ బాలికలకు సైకిళ్లను అందజేశారు.ఈ సందర్భంగా ఫాదర్ సురేష్ మాట్లాడుతూ నా సంస్థ ద్వారా విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని మంచిగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరే స్వతహాగా నిలబడే విధంగా చదువుతూ తల్లిదండ్రులకు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.కమతం రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మీ పాఠశాలలో ఉన్న మహిళా ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని మంచిగా చదవాలని పాఠశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకారం అందిస్తానని ఆయన అన్నారు. సంస్థ ప్రతినిధులు మన పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను అందజేయడం శుభ పరిణామం అని అన్నారు. మంచి క్రమశిక్షణతో ఉంటూ టీచర్లు చెప్పిన విధంగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంచి ఉత్తీర్ణత కనబరిస్తే కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించే విధంగా కృషి చేస్తానని రాజశేఖర్ రెడ్డి విద్యార్థులకు హామీ ఇచ్చారు.తర్వాత సంస్థ ప్రతి నిధులను రాజశేఖర్ రెడ్డి, వీరారెడ్డి లను పాఠశాల ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి కే రవి,పాండు,దిగువ పాడు హెచ్ఎం రాజకుమార్, ఆనందరావు,పక్కిరయ్య మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
