కొత్త బస్టాండులో బాలలతో బిక్షటన చేస్తున్న ఇద్దరు తల్లులు
1 min readబాలలతో బిక్షటనా చేయటం చట్టరీత్యా నేరం, అతిక్రమిస్తే కఠిన శిక్షా అర్హులు
చైల్డ్ హెల్ప్ లైన్1098 కి సమాచారం అందించండి
డాక్టర్:సి.హెచ్ సూర్య చక్రవేణి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు కొత్త బస్టాండ్ నందు బాలలతో భిక్షాటన చేయిస్తున్నా ఇద్దరు తల్లలు మరియు ఇద్దరు బాలలను, ఏలూరు జిల్లా బాలల సంరక్షణ అధికారి వారు డాక్టర్ సి.హెచ్.సూర్య చక్రవేణి గుర్తించి, డిసిపియు, మరియు చైల్డ్ హెల్ప్ లైన్ టీమ్ ద్వారా వారి నుండి వివరములు స్వేకరించడం జరిగింది. వారు తెలంగాణ ప్రాంతం నుండి వచ్చి బిడ్డలకు ఆరోగ్యం సరిలేదని ఊరు వెళ్తుండగా బ్యాగులు పోయినాయి కాబట్టి అంటూ భిక్షాటల్లో కొత్త వరవడి విధానంలో ఎక్కువ డబ్బుల్ని గుంజటానికి ప్రయత్నం చేస్తున్నారు.బాలలతో భిక్షాటన చేయించడం చట్ట రీత్యా నేరం అని అలాగే బాలల విద్య వలన కలిగే ప్రయోజనాలను గురించి బాలల తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. అలాగే బాలల ఈ యొక్క తఃల్లిదండ్రులకు బాలలతో భిక్షాటన చేయిస్తే వారిని చట్ట రీత్యా నేరమని, అతిక్రమిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించరు. అలాగే ఎక్కడైనా బాలలతో భిక్షాటన చేయిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్-1098 కి సమాచారం ఇవ్వాలని డాక్టర్స్ సూర్య చక్రవేణి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ సిబ్బంది, డిసిపి సిబ్బంది రాజేష్ కు, మాధవి, సునీత తదితరులు పాల్గొన్నారు.