PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది..

1 min read

అడిషనల్ డీఎంహెచ్ఓ డా. జమాల్ బాషా
పల్లెవెలుగు వెబ్​, కడప: అంతర్జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా గురువారం కడప నగరంలోని పాత రిమ్స్ సమీపంలో ఉన్న ఎంఎం హాస్పిటల్​ జన వికాస్ సేవా సమితి అధ్యక్షుడు తాహిర్ , చాంద్ బి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి పి మన్సూర్ అలీఖాన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీఎంహెచ్ఓ డా. మాల్ బాషా మాట్లాడుతూ ఎంఎం హాస్పిటల్ అధినేత డాక్టర్ మహబూబ్ పీర్, ఆయన సతీమణి ముంతాజ్ బేగం 45 సంవత్సరాలుగా ప్రజలకు వైద్య సేవలు అందించారని, వారి సేవలు మరవలేనివన్నారు. వారి కుటుంబంలోని ఎనిమిది మంది వైద్యులుగా ఉండి ప్రజలకు చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.

అనంతరంప్రజలకు మంచి వైద్యం అందిస్తున్న ప్రముఖ వైద్యులకు బెస్ట్ డాక్టర్ ఆఫ్ కడప అనే అవార్డు పేరుతో జ్ఞాపికను అందజేసి శాలువాతో సత్కరించారు. సన్మాన పొందిన వైద్యులు డా.మహబూబ్ పీర్, డా.ఆసిఫ్,డా.ఆబిద్ ,డా.ఆనంద్ కుమార్,డా.వినయ్,డా.జహంగీర్, డా.రబ్బానీ,డా.ఆరిఫ్,డా.నజీముద్దీన్, డా.నురి,డా.అబ్దుల్ మజీద్ ,తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో ఎంఐఎం హాస్పిటల్ ఇన్ఛార్జ్ ఫరీద్ భాషా, జనవికాస్ కార్యదర్శి యూనిసు భాషా,సీఎస్ నాసర్ అలీ, ట్రస్ట్ ప్రతినిధులు బాషీర్ బుఖారి, మౌలాలి సయ్యద్, జావీద్, మస్తాన్,అబూబకర్ తదితరులు పాల్గొన్నారు.

About Author