NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్నూలు జీజీహెచ్​లో గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలపై సమీక్ష

1 min read

ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు,  మాట్లాడుతూ:—

పల్లెవెలుగు, కర్నూలు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలపై సమీక్ష నిర్వహించి పేషెంట్లకు అందుతున్న ట్రీట్మెంట్ మరియు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.గులియన్ బారే సిండ్రోమ్  లక్షణాలు  మరియు దీని బారినపడిన వారికి ఒళ్లంతా తిమ్మిరిగా అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం, డయేరియా, పొత్తి కడుపు నొప్పి, జ్వరం, వాంతులు కావడం లాంటి లక్షణాలు ఉంటాయని అన్నారు. కలుషిత ఆహారం,  ద్వారా సోకుతుంది. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థను ఈ వైరస్‌ దెబ్బతీస్తుంది. దీంతో రోగి పక్షవాతం బారిన పడతాడు. అయితే సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదు.  అయితే ప్రజలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.  కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయినట్టు అనిపిస్తే వెంటనే ఆస్పత్రికి రావాలని ప్రజలకు సూచించారు. ఈ వ్యాధి సోకిన వెంటనే చికిత్స అందిస్తే బాధితులకు పూర్తిగా కోలుకుంటారని, ఆందోళన అవసరం లేదని అన్నారు.చికిత్సకు అవసరమైన ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.గులియన్ బారే సిండ్రోమ్ లకు నోడల్ అధికారిగా డా.దమం శ్రీనివాసులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.

గులియన్-బారే సిండ్రోమ్ యొక్క లక్షణాలుఃఈ వ్యాధి యొక్క లక్షణాలు క్రమంగా అభివృద్ధి చెందుతాయి. కాలక్రమేణా తీవ్రంగా మారవచ్చు. దీని ప్రధాన లక్షణాలు:-1. చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి ఇది మొదట పాదాలు, చేతుల్లో తిమ్మిరి అనుభూతి చెందుతుంది. క్రమంగా మొత్తం శరీరానికి వ్యాపిస్తుంది.

కండరాల బలహీనత:బలహీనత మొదట కాళ్ళలో సత్తువ కోల్పోతాయి తరువాత అది పైకి కదలవచ్చు, దీనివల్ల నిలబడటానికి మరియు నడవడానికి ఇబ్బంది కలుగుతుంది.శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: తీవ్రమైన సందర్భాల్లో, శ్వాస కండరాలు ప్రభావితమవుతాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. దీనికి వెంటిలేటర్ అవసరం కావచ్చువేగవంతమైన హృదయ స్పందన, రక్తపోటు ఇది స్వయంప్రతిపత్త నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. దీని వలన రక్తపోటులో హెచ్చుతగ్గులు, హృదయ స్పందనలో క్రమరాహిత్యాలు ఏర్పడతాయి.ముఖం, కంటి కండరాలపై ప్రభావం: కొన్ని సందర్భాల్లో, ముఖ నరాలు ప్రభావితమవుతాయి. మాట్లాడటం, నమలడం,చూడటంలో సమస్యలు వస్తాయి.

మీరు జాగ్రత్తలు తీసుకోండి:పైన పేర్కొన్న లక్షణాలను మీరు ఎదుర్కొంటుంటే, ముఖ్యంగా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్, ఫ్లూ లేదా డెంగ్యూ వంటి అనారోగ్యం తర్వాత, వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించడం, సరైన చికిత్స ద్వారా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చు అని అన్నారు.ఈ కార్యక్రమానికి  సి ఎస్ ఆర్ ఎమ్ ఓ, డా.వెంకటేశ్వరరావు, జనరల్ మెడిసిన్ హెచ్ ఓ డి, డా.ఇక్బాల్ హుస్సేన్, న్యూరాలజీ హెచ్ ఓ డి, డా.శ్రీనివాసులు, పీడియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్, డా.రవీంద్రనాథ్ రెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్, డా.శివ బాల నగాంజన్, డా.కిరణ్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *