విజ్ఞాన పీఠం సందర్శించిన రాష్ట్రీయ సేవా సంవర్దన సమితి అధ్యక్షులు గోకరాజు గంగరాజు
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: శుక్రవారం విశ్వ హిందూ పరిషత్ సేవా ప్రకల్పమైన విజ్ఞాన పీఠం (అరక్షిత శిశుమందిరం) ను విశ్వ హిందూ పరిషత్ కేంద్రీయ ఉపాధ్యక్షులు, అఖిల భారతీయ సేవా విభాగమైన రాష్ట్రీయ సేవా సంవర్ధన సమితి అధ్యక్షులు,మాజీ పార్లమెంటు సభ్యులైన గోకరాజు గంగరాజు ఈరోజు సందర్శించారు. అనంతరం విద్యార్థులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ” సేవాహీ పరమోధర్మః ” అన్న ఆర్యోక్తి ప్రకారం గౌరవనీయులు, అత్యంత క్రమశిక్షణ గల వ్యక్తి కీ.శే. గుణంపల్లి పుల్లారెడ్డి 1971 లో ప్రారంభించి ఇప్పటికీ,రాబోయే రోజుల్లో కూడా వేలాది మంది పిల్లలకు విద్యతో పాటు సంస్కారం,భారతీయత పట్ల అవగాహన కలిగించేలా విద్యాబోధన ఇక్కడ జరిగేలా ఇక్కడ నిర్మించి ఇచ్చిన వారి దాతృత్వం అపూర్వమని, వారి తదనంతరం వారి కుటుంబీకులు ఈ అరక్షిత శిశు మందిరం కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు.విశ్వ హిందూ పరిషత్ దక్షిణాంధ్ర రాష్ట్ర అధ్యక్షులు నంది రెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ గోకరాజు గంగరాజు మోట్టమోదటిసారిగా మన దక్షిణాంధ్ర ప్రదేశ్ కు వచ్చారనీ రాష్ట్రీయ సేవా సంవర్దనం అధ్యక్షులుగా ఈ విజ్ఞాన పీఠం ను సందర్శించారనీ, వారికి మా హార్దిక ఆహ్వానం పలుకుతున్నామన్నారు.అనంతరం గోకరాజు గంగరాజు ని సాయిరెడ్డి,జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మెన్ సుబ్బారెడ్డి లు శాలువా, జ్ఞాపికతో సతకరించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షులు, విజ్ఞాన పీఠం ప్రధానాచార్యులు మాళిగి వ్యాసరాజ్, ఉపాధ్యక్షులు యర్రం విష్ణువర్ధన్ రెడ్డి, రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ సందీప్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి మాళిగి భాను ప్రకాష్, మాణిక్యరెడ్డి, రామిరెడ్డి ,సుదర్శన్ రావు,శ్రీనివాసులు,చంద్రమోహన్, తదితరులు పాల్గొన్నారు.
