పట్టభద్రులంతా కూటమి ప్రభుత్వానికి అండగా నిలవలసిన తరుణం ఆసన్నమైంది
1 min read
కూటమి అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ ని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి
పల్లెవెలుగు,ఏలూరుజిల్లా ప్రతినిధి: అభివృద్ధి ఆకాంక్షలకు, సంక్షేమ సౌఖ్యాలకు పట్టభద్రులంతా అండగా నిలవాల్సిన తరుణం అసన్నమైందని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టిడిపి పరిశీలకురాలు ఆచంట సునీత, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు అభిప్రాయపడ్డారు. శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయం లో ఏర్పాటు సమావేశంలో వీరు మాట్లాడుతూ ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని మరింత విస్త్రృతంగా నిర్వహిస్తున్న వారు తాజాగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ప్రచారపర్వాన్ని నిర్వహించారు. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తుల రాజశేఖరాన్ని పట్టభద్రులు మొదటి ప్రాధాన్యతా ఓటుతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పరిశీలకురాలు సునీత, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహాన్‌లు మీడియాతో మాట్లాడుతూ విజ్ఞతతో పట్టభద్రులైన ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. మంచి ప్రభుత్వంగా పేరుగాంచిన కూటమి ప్రభుత్వానికి మరింత మంచి చేసే అవకాశం కలగాలంటే ఎమ్మెల్సీ అభ్యర్ధి పేరాబత్తులను అత్యధిక మెజార్టతో గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కో -ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు,చోడే వెంకటరత్నం, మరియు మున్సిపల్ కార్పొరేషన్ డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
