బెల్ట్ పై ఎక్సైజ్ పోలీసుల దాడులు..
1 min read
సారా వద్దు..ప్రశాంత జీవనం గడపాలని అవగాహన
పల్లెవెలుగు , నందికొట్కూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో శుక్రవారం మద్యం అమ్ముతున్న దుకాణాలపై నంద్యాల జిల్లా అధికారి రవికుమార్ ఆదేశాల మేరకు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు చేశారు.నందికొట్కూరు ప్రొహిబిషన్ ఎస్ఐ ఎస్ఎండీ జఫురుల్లా తెలిపిన వివరాల మేరకు మాకు అందిన సమాచారం మేరకు గ్రామంలోని ఆంజనేయ స్వామి మరియు చెన్నకేశవ స్వామి దేవాలయ సమీపంలో దాడులు జరపగా ఒకరి వద్దనున్న 12 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.అదేవిధంగా నందికొట్కూరు పట్టణం నీలి షికారి కాలనీలో నవోదయం టు సంబంధించిన నాటు సారాను పూర్తిగా మానేయమని ఆరోగ్యకరమైన జీవితం గడపాలని కాలనీ వాసులకు ఎక్సైజ్ ఎస్సై అవగాహన కల్పించారు. నాటు సారా అమ్మడం వల్ల కేసులు నమోదు అయితే జీవితాలు నాశనం అవుతాయని కుటుంబాలు సంతోషంగా జీవనం సాగాలంటే నాటు సారాకు దూరంగా ఉండాలని అన్నారు. తర్వాత కాలనీలో ర్యాలీ చేపట్టారు.ఈ కార్యక్రమంలో నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సిబ్బంది కుమారి,సంధ్యారాణ,శ్వేతా రాణి,శంకర్ నాయక్,శివన్న తదితరులు పాల్గొన్నారు.