పత్తికొండ జడ్జి దివ్య బదిలీ
1 min readఘనంగా సన్మానించి వీడ్కోలు పలికిన న్యాయవాదులు.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : పత్తికొండ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వి.దివ్య తన విధి నిర్వహణలో అంకితభావం తో పనిచేసి, ప్రజలకు మెరుగైన న్యాయసేవలు అందించారని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు బి.రంగస్వామి అన్నారు. బుధవారం కర్నూలు జిల్లా, పత్తికొండ జడ్జి దివ్య నందికొట్కూరు కు బదిలీ అయి వెళ్తున్న సందర్భంగా స్థానిక కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. జడ్జి దివ్య ని న్యాయవాదులు శాలువాలు, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పత్తికొండ కోర్టులో జడ్జి దివ్య గత రెండున్నర సంవత్సరాలుగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారన్నారు. న్యాయవాదులతో పాటు కోర్టు సిబ్బందితో ఒక కుటుంబ సభ్యురాలిగా కలిసి పోయేవారని తెలిపారు. బదిలీ పై వెళ్తున్న జడ్జి దివ్య భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం జడ్జి దివ్య మాట్లాడుతూ… పత్తికొండ కోర్టు లో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందించిన సహకారం మరువలేనిది అన్నారు. బదిలీపై వెళ్లడం బాధాకరమని అని, ఇక్కడి జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు అందించిన సహకారం జీవితాంతం గుర్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షుడు రవి, సహాయ కార్యదర్శి వాసుదేవ, న్యాయవాదులు ఎల్లారెడ్డి, మైరాముడు, గోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ నాయుడు, రమేష్ బాబు, మల్లికార్జున, నాగేష్, నరసింహయ్య, సురేంద్ర, కృష్ణయ్య, బాలబాష, జటంగిరాజు, దామోదర ఆచారి, నాగలక్ష్మయ్య, జటంగి రాజు, ప్రసాద్ బాబు, నారాయణస్వామి, వెంకటేశ్వర్లు, రవి ప్రకాష్, సుధాకృష్ణ, చిన్న మునెయ్య, భాస్కర్, శ్రీకాంత్ రెడ్డి, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.