కార్మిక చట్టాలను కాపాడుకుందాం..
1 min read

ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షులు,. పి. రామచంద్రయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్
పత్తికొండలో సార్వత్రిక సమ్మె విజయవంతం, నిలిచిపోయిన బస్సులు, స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్న అన్ని వర్గాల ప్రజలు.
పత్తికొండ, న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం మెడలు వంశీ కార్మిక చట్టాలను కాపాడుకుందాం అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి. రామచంద్రయ్య, సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి ఎన్. కృష్ణయ్యలు స్పష్టం చేశారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా గురువారం పత్తికొండలో ఏఐటీయూసీ, సిఐటియు ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె విజయవంతంగా కొనసాగింది. కార్మికులు వ్యవసాయ కూలీలు రైతులు పెద్ద సంఖ్యలో స్థానిక ఎంపీడీవో కార్యాలయం నుండి ప్రధాన రహదారి గుండా ర్యాలీ చేపట్టి నాలుగు స్తంభాల మండపం దగ్గర ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు నెట్టికంటయ్య, సిఐటియు మండల అధ్యక్షులు గోపాల్ అధ్యక్షతన సార్వత్రిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా నాలుగు స్తంభాల కూడలి వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో వారు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల లోపు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గిస్తామని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయినా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తూ కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

