మనం ఎందుకు ‘ఓడిపోతున్నామో’.. తెలుసుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ : జీవితంలో ప్రతి ఒక్కరూ గెలవాలని కోరుకుంటారు. ప్రతి పనిలో విజయం సాధించాలని ఆరాటపడుతారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ఒక్కోసారి ఓడిపోవచ్చు. నిరాశ కలగొచ్చు. అప్పుడు ఏం చేయాలి. ఓటమిని అంగీకరించాలా ?. లేకుంటే ఓటమిని అంగీకరించకుండా.. చివరి వరకు పోరాడాలా ?. ఇలాంటి కారణాలను విశ్లేషించారు ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా.
- పనిలో సౌకర్యం చూసుకోవడం.
- తప్పుల్ని పట్టుకుని వేలాడటం.
-మార్పుకు సుముఖంగా లేకపోవడం - ఆత్మవిశ్వాసం లేకపోవడం
- నిలకడలేమి
- మనపై మనకు నమ్మకం లేకపోవడం
- మరింత కృషి చేయడానికి సిద్దంగా లేకపోవడం.
- చేస్తున్న పని నుంచి పక్కదారి పట్టడం
- చేసిన వెంటనే ఫలితం ఆశించడం.
పై కారణాల వల్ల ఓటమిని అంగీకరించాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన విశ్లేషించారు. థర్స్ డే థాట్స్ హ్యాష్ ట్యాగ్ తో ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు.