శ్రీశైలంలో దాతల సహకారంతో అన్నదానం..
1 min read
పల్లెవెలుగు ,కర్నూలు: శ్రీశ్రీ అఖిలభారత కురువంశ నిత్యాన్నదాన సత్రం రిజిస్ట్రేషన్ నంబర్ 127/1989 వారి ఆధ్వర్యంలో శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 23 వ తేదీ నుంచి 27 తారీకు వరకు అన్నదానం జరుగుతుందని సత్రం కమిటీ అధ్యక్షులు ఎం. కే.రంగస్వామి కమిటీ సభ్యులు గుడిసె శివన్న పి. శ్రీనివాసులు, కే వెంకటేశ్వర్లు, కే.మహేశ్వర్, కే. ప్రసాద్, కే. సి. నాగన్న, కే. నాగశేషులు, కే. బీరప్ప, కే. వెంకటేశ్వర్లు శ్రీశైలంలో రేపటి నుంచి శివరాత్రి అనంతరం వరకు మూడు పూటలా ఉదయం టీఫీన్ మద్యాహ్నం రాత్రి భోజనం అన్నదాన కార్యక్రమం సత్రం కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో దాతలు రాయలసీమ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు ఐదు వేలు,కురువ దేవిరెడ్డి పదివేలు, పర్ల లింగన్న కుమారుడు మల్లికార్జున కూరగాయలు, కర్నూలు జితేంద్ర పది వేలు మరియు తదితరుల సహకారం తో సత్రం వద్ద అన్నదానం జరుగుతున్నట్లు వారు తెలిపారు. కురువ కులస్థులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు.