అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరి
1 min read
నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
పల్లెవెలుగు, కర్నూలు: శనివారం నగరంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా అధికారులు పర్యవేక్షించాలని నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు అన్నారు. శనివారం ఆయన బి.క్యాంపు, శరీన్ నగర్, రాఘవేంద్ర నగర్ ప్రాంతాల్లో, పూర్తైన రహదారులు, మురుగు కాలువలు, కల్వర్టు నిర్మాణ పనులను, అలాగే పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. అభివృద్ధి పనుల నిర్మాణాల్లో నాణ్యతను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, క్యూరింగ్ పూర్తి అయిన తరువాతనే పనుల చివరి బిల్లులు పెట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఈ రాజశేఖర్, డిఈఈలు గిరిరాజు, మనోహర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ఏఈ భాను ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.