నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు…
1 min read
జగన్నాధ గట్టు జర్నలిస్ట్ ల ఇళ్ల స్థలాలు అభివృద్ధి
జర్నలిస్ట్ ల పిల్లలకు 100శాతం విద్యారాయితీ
జర్నలిస్ట్ ల అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం
యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్)
పల్లెవెలుగు, కర్నూలు: కర్నూలు నగరంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు, జగన్నాధ గట్టు జర్నలిస్ట్ ల ఇళ్లస్థలాలు అభివృద్ధి,జర్నలిస్ట్ ల పిల్లలకు 100విద్యారాయితీ వంటి సమస్యలపై లక్ష్యంగా పనిచేస్తామని యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) నాయకులు పేర్కొన్నారు.శనివారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ఆధ్వర్యంలో కర్నూలు హార్ట్ ఫౌండేషన్ లో నీలం సత్యనారాయణ,చిన్న రామాంజనేయులు అధ్యక్షతన జర్నలిస్ట్ ల జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కర్నూలు నగర కమిటీ నూతన కార్యవర్గంను ప్రజాస్వామ్య పద్దతిలో నియామకం చేశారు.అనంతరం శేషపణి,కంది వరుణ్ కుమార్,లీగల్ ఆడ్వజర్ గురుప్రసాద్ చిన్న రామాంజనేయులు మాట్లాడారు. సమాజంలో జర్నలిజం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.అలాంటి జర్నలిస్ట్ లు నేడు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఏర్పడుతుందన్నారు.సంస్థల టార్గెట్ లను పూర్తిచేయలేక ఇబ్బందులు పడుతున్నారు.అంతేకాకుండా వార్తలు రాసే సమయంలో సైతం సంకెళ్లు వేసే విధంగా కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.మరోవైపు సరైన వేతనాలు లేకుండా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్న కూడా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజలకు, ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేస్తున్నారని అన్నారు.ఇలాంటి నేపథ్యంలో జర్నలిస్ట్ ల సంక్షేమ పథకాలు నీరు గారుస్తున్న దుస్థితి ఉందన్నారు. కావున యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్ట్ లను చైతన్యం చేసి పెండింగ్ లో ఉన్న సమస్యలపై న్యాయం జరిగేవరకు దీర్ఘకాల పోరాటాలు సాగిస్తామని చెప్పారు.భవిష్యత్ లో యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం (యుజెఎఫ్) పోరాటాలకు జర్నలిస్ట్ లు తమ మద్దతు తెలియచేయాలనీ వారు కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు సాగర్,విజయ్ కుమార్,పరమేష్, చంద్రమోహన్,యూసుఫ్ ఖాన్,మల్లికార్జున,విజయ్ కుమార్, గంగాధర్,విజయ్ కుమార్,వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్,వివిధ సంస్థల జర్నలిస్ట్ లు పాల్గొన్నారు.
నగర కమిటీ : అధ్యక్షులు పి.నాగేంద్రుడు,ప్రధాన కార్యదర్శి జి.మునిస్వామి,కోశాధకారి యు.రాజశేఖర్,ఉపాధ్యక్షులు వి.ప్రసాద్,ఎన్.కె.మధు,డి.సంజీవయ్య,సహాయ కార్యదర్శులు టి.జయబాబు,రవి గౌడ్,మధుసూదన్,ఎగ్జిక్యూటివ్ సభ్యులు పి.రవి.ఆర్.చంద్రశేఖర్,ఈ.రవిశంకర్ గౌడ్,పి.సుంకన్న,రాజు,పి.జయరాజు,ఎన్.వజ్రరాజు.