హాస్పిటల్ వర్కర్లకు భరోసా…‘ జి.ఎన్.ఆర్.’
1 min read
ఆయా దేవమ్మకు రూ. 50వేలు ఆర్థిక సాయం అందజేసిన
జి.ఎన్.ఆర్. హాస్పిటల్ అధినేత డా. నాగేశ్వరయ్య
కర్నూలు, పల్లెవెలుగు:ఆస్పత్రిలో పని చేసే కార్మికులను ఆదుకోవడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు జి.ఎన్.ఆర్. హాస్పిటల్ అధినేత డా. నాగేశ్వరయ్య. నగరంలోని గాయత్రి ఎస్టేట్ లోని జి.ఎన్. ఆర్. హాస్పిటల్ లో మూడేళ్లుగా దేవమ్మ ఆయాగా పని చేస్తోంది. కొన్ని రోజుల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు. విషయం తెలుసుకున్న హాస్పిటల్ అధినేత డా. నాగేశ్వరయ్య ఆయా దేవమ్మ కు రూ. 50వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా డా. నాగేశ్వరయ్య మాట్లాడుతూ తమ హాస్పిటల్ లో పని చేస్తున్న నర్సులు,ఆయాలు ఆపదలో ఉంటే ఆర్థికంగా ఆదుకుని, అండగా ఉంటామన్నారు. భవిష్యత్‌లోనూ దేవమ్మ పిల్లల చదువులకు తగిన ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. నగరంలోని పలు ఆస్పత్రులలో పని చేసే కార్మికులకు యాజమాన్యం ఆదుకోవడం బాధ్యతగా భావించాలని సూచించారు. కార్యక్రమంలో డా. నాగేశ్వరయ్య సతీమణి లక్ష్మీదేవి, డాక్టర్ మహేష్ నాయుడు, డ్యూటీ డాక్టర్ నాగేంద్ర,,మేనేజర్ శివ, హాస్పిటల్ ఇన్చార్జి కుమార్, మరియు జిఎన్ఆర్ హాస్పిటల్ నర్సులు డాక్టర్లు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.