ఇంటింటి సర్వే పై అవగాహన…
1 min read
పల్లెవెలుగు ,కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు సోమవారం నాడు అనగా 24-02-2025 న కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ లో గల డైస్ సెంటర్ నందు ఇంటింటి సర్వే పై అవగాహన కల్పించిన న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి. అనంతరం న్యాయమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు లీగల్ సర్వీసెస్ వారు ఇంటింటి సర్వే నిర్వహించడానికి న్యాయవాదులు, పారా లీగల్ వలుంటీర్లు, ఆశ వర్కర్ ర్లు , ఎ.ఎన్.ఏం.,లు, కమ్యూనిటి హెల్త్ ఆఫీసర్లచే టీమ్లను ఏర్పాటుచేసి కర్నూలు మరియు నంద్యాల జిల్లాల లో విభిన్న సామర్థ్యం గల పిల్లలు మరియు చిన్న వయస్సులోనే ఆరోగ్య లోపాలు గల పిల్లలను గుర్తించి వారికి బాలల సత్వర చికిత్స కేంద్రం ద్వారా చికిత్సలు చేపించడం జరుగుతుందని గుర్తించిన ఆరోగ్య లోపాలు గల పిల్లలను ఈ డైస్ సెంటర్ కు తీసుకోని వచ్చి వారికి అక్కడి డాక్టర్ చే చికిత్స లు చేపించారు.అక్కడి పిల్లలు తల్లి దండ్రులకు ఈ వైద్య సదుపాయల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీసర్ భాస్కర్, డైస్ సెంటర్ ప్రోగ్రాం ఆఫీసర్ శై లే ష్ కుమార్, ప్రోగ్రాం మేనేజర్ ఇర్ఫాన్, డాక్టర్ సృజన , ఐ. సి. డి. ఎస్. అధికారి శారద,న్యాయవాది లక్ష్మి నారాయణ , డాక్టర్ రాయపాటి శ్రీనివాసులు, ప్యారా లీగల్ వాలంటీర్స్ హేమంత్, ఏ. ఎన్. ఎం లు, అంగన్వాడీ వర్కర్స్, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.