రంజాన్ కు మసీదులు ముస్తాబు…
1 min read
పల్లెవెలుగు, హొళగుంద: వచ్చేనెల 1 లేదా 2 తేదీన ప్రారంభమై రంజాన్ నెల కటోర ఉపవాస దీక్ష కోసం అహలె హదీస్ మసీదు లు, ఆహలేశున్నతుల్ జమాత్ మసీద్, తబ్లిక్ మసీద్, రాజా నగర్ లోని మసీదు ముస్లిం కమిటీ మరియు ముటవల్లీలు అన్ని రంగులతో ముస్తాబు చేస్తున్నారు. రంజాన్ నెలలో ఉపవాస దీక్షలతో పాటు ఐదు పూటల నమాజు మరియు రాత్రి వేళలో ప్రత్యేకంగా చేసే తరారీ నమాజు కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ముతవల్లిలు కొలిమి వాహిద్, ముల్లావలి, ముల్లా షబ్బీర్, శాలి ఫక్రుద్దీన్, డాక్టర్ ఖాసీం, పింజారు సనావుల్లా, ముల్లా అల్లా బకాష్ ఆదివారం తెలిపారు. ప్రార్థన కోసం వచ్చే ముస్లిం సోదరులు, మహిళలు, బాల బాలికలు, కటోర ఉపవాస దీక్షల కోసం మసీదులో త్రాగునీరు, విద్యుత్, ఫ్యాన్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలు సదుపాయం కల్పించడానికి అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. మసీదులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. మండలంలోని అన్ని మసీదులను రంజాన్ నెల సందర్భంగా మసీద్ ముసవల్లీలు అన్ని హంగులతో ముస్తాబు చేశారు. సంబంధిత అధికారులు రంజాన్ నెలలో త్రాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం లోపించకుండా చూడాలని టిడిపి నాయకులు అబ్దుల్ సుభాన్, డి ఎస్ భాషా, మోయిన్, బడే గర్ అబ్దుల్లా, ముల్లావలి కోరారు.