ప్రభుత్వం నిబంధనలు పాటించని రెయిన్బో స్కూల్ ని సిజ్ చేయండి…
1 min read
కలెక్టర్ రంజిత్ బాషా కి వినతిపత్రం అంద చేసిన ఆర్పీ ఎస్ ఎఫ్, ఆర్ యూ ఎస్ ఎఫ్ విద్యార్ధి సంఘం నాయకులు
పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు: నందవరం మండలంలో ప్రభుత్వం నిబంధనలు పాటించని రెయిన్బో స్కూల్ ని సిజ్ చేయాలి అని ఆర్ పి ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది, ఆర్ యూ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ లు కలెక్టర్ రంజిత్ బాషా కి ఫిర్యాదు చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నందవరం మండలంలో ఉన్న రెయిన్బో స్కూల్ కీ ప్రభుత్వం నుంచి ఫైర్, పొల్యూషన్, సౌండ్ అనుమతులు లేవని ముఖ్యంగా స్కూల్ బస్ కి ఫిట్నెస్ పర్మిట్ లేకుండానే బస్ ఏర్పాటు చేశారు. స్కూల్ యాజమాన్యం ఆటోలలో వ్యాన్లో అధిక మొత్తంలో విద్యార్థులను తరలిస్తూ విద్యార్థుల యొక్క జీవితాలతో చలగాటమాడుతున్నారని.ఆవేదన వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ దానికి అదనంగా బుక్స్,యూనిఫామ్ ఫీజ్, బస్ ఛార్జీలని వసూలు చేయడం దారుణమని స్కూల్ యొక్క వాహనాలను ఆర్టీవో ఫైన్ లు వేసిన కూడా ఇప్పటికే అలాగే ఆటోలలో వ్యాన్లో విద్యార్థులను తరలిస్తు రెయిన్బో స్కూల్ యాజమాన్యం మాత్రమే మాకు ఏమి సంబంధం లేనట్లు ప్రవర్తిస్తున్నారని వారన్నారుఆ స్థలంపెట్రోల్ బంక్ కోసంఏర్పాటు చేయడానికిపర్మిషన్లు తెచ్చుకోవడం జరిగిందికానీ పెట్రోల్ బంక్ కోసం తెచ్చుకున్నటువంటి పర్మిషన్ లో స్కూలు ఎలా పెడతారని వారు ఆరోపించారు. ఈ విషయంపై స్పందించిన కలెక్టర్ రంజిత్ భాష స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈవో కి ఆదేశించారు.