PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అసమర్థ ఎమ్మెల్యే ‘గద్దె’…

1 min read

తనను గెలిపిస్తే మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

మీట్‌ది ప్రెస్‌లో విజయవాడ తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్‌

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : పది సంవత్సరాలు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేసిన గద్దె రామ్మోహన్‌రావు ఒక అసమర్ధ ఎమ్మెల్యేగా మిగిలారని  తూర్పు నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్‌ ఆరోపించారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన మీట్‌దిప్రెస్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  కృష్ణలంక రిటైనింగ్‌ వాల్‌ని వైసీపీ ప్రభుత్వం నిర్మిస్తే తాము నిర్మించామని గద్దె రామ్మోహన్‌ వీడియోలు పంపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా, అభివృద్ది చేయకుండా తూర్పు నియోజకవర్గాన్ని గాలికొదిలాశారని విమర్శించారు. 2019లో కృష్ణాదికి వరదలు వచ్చాయి. 2020 సంవత్సరం  కరోనా సమయంలో కూడా వరదలు వచ్చాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా ఆయన పెద్ద మనస్సుతో స్పందించి మొదటి పేజ్‌గా 150 కోట్లు కేటాయించారని, ఆ నిధులతో రిటైనింగ్‌ వాల్‌ నిర్మించామని తెలిపారు. గతంలో పోల్చుకుంటే ఎవరూ చేయలేని విధంగా తాను ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో కొండ ప్రాంతాలకు మెట్లు, నీటి సదుపాయం, డ్రైన్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని వివరించారు. తూర్పులోని అన్ని డివిజన్‌లలో అభివృద్ది చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. ఎప్పటి నుంచో మైనారిటీ సోదరులు అడుగుతున్న షాదిఖానా  కోసం ఆర్‌అండ్‌బి స్ధలాన్ని మున్సిపల్‌ కార్పొరేషన్‌కు స్వాధీనం చేసేలా ముఖ్యమంత్రి జీవో పాస్‌ చేశారని,  2కోట్లు నిధులు మంజూరు చేయగా శంకుస్ధాపన జరిగి, ప్రారంభించేందుకు సిద్దంగా ఉందన్నారు. పరిసర ప్రాంతాల మైనారిటీ సోదరులు ఫంక్షన్‌ లు చేసుకునేందుకు పకీరుగూడెంలో షాదిఖానా ప్రారంభం అవుతుందన్నారు. భ్రమరాంబపురంలో గత 70 సంవత్సరాల నుంచి ఇళ్లపట్టాల సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పరిష్కరించగలిగారని తెలిపారు. క్రీస్తురాజపురం కొండ ప్రాంతంతో పాటు 4 అర్బన్‌ హెల్త్‌సెంటర్‌లను ఏర్పాటు చేశామన్నారు. అవినీతితోగాని, బెట్టింగ్‌లతో గాని అవినాష్‌కు ఎటువంటి సంబంధం లేకపోవడంతో ఏదో రకంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. గద్దె రామ్మోహన్‌ బెట్టింగులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో చిత్తుగా ఓడిరచాలని కోరారు. ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులు కంచల జయరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్‌, విజయవాడ అధ్యక్షులు చావా రవి, ప్రెస్‌క్లబ్‌ కార్యదర్శి  దాసరి నాగరాజు, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌.రమణారెడ్డి, ఐజేయూ సభ్యులు షేక్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

About Author