కర్నూలు జీజీహెచ్లో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పర్యటన
1 min read
పల్లెవెలుగు, కర్నూలు: కర్నూలు పార్లమెంట్ సభ్యులుబస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ…కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కె. వెంకటేశ్వర్లు తో కలిసి పలు వార్డులను సోమవారం సందర్శించారు. అనంతరం ఆర్ ఐ సి యు, మరియు ఎమర్జెన్సీ విభాగాలలో ఉన్న పేషెంట్లకు పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సదుపాయాలు, కనిపిస్తున్న సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో ఉన్న వైద్య సిబ్బంది వివరాలపై ఆరా తీశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.ఆసుపత్రికి సంబంధించిన పలు విషయాలపై ఆసుపత్రి సూపరిండెంట్ తో చర్చించారు. అనంతరం ఆసుపత్రికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు.రాయలసీమకే తలమానికైనా ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేయడానికి నా వంతు సహకారాలు ఉంటాయని అన్నారు. ఆసుపత్రికి కావలసిన డెవలప్మెంట్ మరియు వైద్య పరికరాల కోసం అవసరమైతే గౌ” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో చర్చిస్తా అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మరియు వైద్యులు మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.