లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ లీడర్ షిప్ అవార్డు ప్రధానం
1 min read
పల్లెవెలుగు , కర్నూలు: ఇంటర్నేషనల్ అకాడమీ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ అంతర్జాతీయ సంస్థ 2023- 24 సంవత్సరానికి అందించే అంతర్జాతీయ స్థాయి అవార్డుల ప్రధానోత్సవం లో నైస్ యూత్ ఫర్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ అధ్యక్షులు లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ కు నేడు అంతర్జాతీయ స్థాయి గ్లోబల్ లీడర్ షిప్ అవార్డును ప్రధానం చేసింది.సేవా కార్యక్రమాలలో భాగంగా, న్యాయ విజ్ఞాన శిబిరాలు నిర్వహించడం, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ,యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్ తదితర కార్యక్రమాలు నిర్వహించడం, బాల్యవివాహాలు , చైల్డ్ అబ్యూస్, బాల కార్మిక నిర్మూలన, కన్స్యూమర్ యాక్ట్, హ్యూమన్ రైట్స్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం దివ్యాంగుల వృత్తి శిక్షణా కార్యక్రమం నిర్వహించడం తదితర సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అవార్డుదిక్కడం సంతోషంగా ఉందని గత సంవత్సరం 250 పైగా సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు.