ఏపీలో 100 రోబోటిక్-సహాయక సర్జరీలలో మొదటి ఆసుపత్రి- ప్రశాంత్ హాస్పిటల్
1 min read
ఏపీలో 100 రోబోటిక్-సహాయక యూరాలజికల్ సర్జరీలను పూర్తి చేసిన మొదటి ఆసుపత్రి- ప్రశాంత్ హాస్పిటల్
విజయవాడ, న్యూస్నేడు : ఈ 100 రోబోటిక్-సహాయక సర్జరీలలో, 40 సర్జరీలలో ‘రోబోట్‘ సహాయంతో కిడ్నీ లేదా మూత్రపిండాల లో కొంత భాగాన్ని మాత్రమే తోలిగంచడం (పాక్షిక నెఫ్రెక్టమీ) ద్వారా కిడ్నీ పనితీరును కాపాడటానికి కి దోహదపడ్డాయి, దీని వలన రోగి కి ఫలితాలు గణనీయంగా మెరుగుపడ్డాయి. విభిన్న వర్గాలకు చెందిన రోగులకు యూరాలజికల్ సర్జరీల కోసం అధునాతన రోబోటిక్ టెక్నాలజీని అందించే ఏకైక ఆసుపత్రి ప్రశాంత్ హాస్పిటల్. దక్షిణ భారతదేశంలోని ప్రముఖ యూరాలజీ ఆసుపత్రులలో ఒకటైన ప్రశాంత్ హాస్పిటల్, 100 రోబోటిక్-సహాయక యూరాలజికల్ సర్జరీలను పూర్తి చేసినట్లు వెల్లడించింది. ముఖ్యంగా, నిర్వహించిన 100 శస్త్రచికిత్సలలో 40 సంక్లిష్టమైన పాక్షిక నెఫ్రెక్టమీలు కూడా ఉన్నాయి. ఇక్కడ సర్జన్లు శస్త్రచికిత్స సమయంలో ఆరోగ్యకరమైన కణజాలానికి హాని కలిగించకుండా ,మూత్రపిండాల పనితీరును కాపాడే రీతిలో చికిత్స చేశారు. ఈ విధానం, డయాలసిస్ అవసరం వంటి దీర్ఘకాలిక సమస్యల సంభావ్యతను తగ్గించింది, తద్వారా రోగుల జీవన నాణ్యత గణనీయంగా మెరుగుపడింది.ఆసుపత్రి నిర్వహించిన కొన్ని సంక్లిష్టమైన కేసుల గురించి , ప్రశాంత్ హాస్పిటల్‌లో యూరో-ఆంకాలజిస్ట్ మరియు రోబోటిక్ సర్జన్ అయిన డాక్టర్ ప్రియతం కాసరనేని మాట్లాడుతూ, “మేము రెండు దశల రోబోటిక్-సహాయక ప్రక్రియను నిర్వహించాము – మొదట ఎడమ పాక్షిక నెఫ్రెక్టమీ అనంతరం రెండు వారాల తర్వాత కుడి పాక్షిక నెఫ్రెక్టమీ ని 60 ఏళ్ల పని చేసే వర్కింగ్ ప్రొఫెషనల్ మరియు ఇద్దరు పిల్లల తండ్రికి చేసాము. అతనికి బైలాటరల్ రెనల్ సెల్ కార్సినోమా (రెండు మూత్రపిండాల ఎగువ భాగంలో కాన్సర్ కణితులు) ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ విధానం తో గరిష్టంగా మూత్రపిండాల పనితీరును కాపాడుతూనే ఖచ్చితమైన రీతిలో కణితి తొలగింపును నిర్ధారిస్తుంది, రోబోటిక్-సహాయక శస్త్రచికిత్స ప్రమాదాలను తగ్గిస్తుంది మరియు త్వరగా కోలుకోవడానికి వీలు కల్పిస్తుంది. మరొక అద్భుతమైన సందర్భంలో, తరచుగా మూత్ర ఇన్ఫెక్షన్లు మరియు అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్న ఆరు నెలల శిశువుకు యూరిటెరోపెల్విక్ జంక్షన్ (UPJ) అడ్డంకి ఉన్నట్లు నిర్ధారణ అయింది. అధునాతనడావిన్సీ రోబోటిక్ వ్యవస్థను ఉపయోగించి, అడ్డంకిని తొలగించడానికి, అతి తక్కువ కోత తో మేము ఖచ్చితమైన ప్రక్రియను నిర్వహించాము. శిశువు సజావుగా కోలుకుంది, 24 గంటల్లోపు ఆహారం తిరిగితీసుకోవటం ప్రారంభించింది మరియు కేవలం మూడు రోజుల్లోనే డిశ్చార్జ్ చేయబడింది” అని అన్నారు.ఈ విజయంపై ప్రశాంత్ హాస్పిటల్‌లోని రోబోటిక్ సర్జన్ డాక్టర్ ధీరజ్ కాసరనేని మాట్లాడుతూ, “తాము అధునాతన డావిన్సీ రోబోటిక్ టెక్నాలజీని స్వీకరించడానికి ముందు,చాలా కేసుల లో పాక్షిక నెఫ్రెక్టోమీల వంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు అవసరమయ్యే చోట లాపరోస్కోపిక్ సాధనాల్లోని పరిమితుల కారణంగా చాలాసార్లు మూత్రపిండాలను పూర్తిగా తొలగించడానికి దారితీశాయి. ఈ సాంకేతికతతో, మేము అవయవాలను కాపాడటమే కాకుండా, రోగులపై శారీరక మరియు భావోద్వేగ భారాన్ని తగ్గించడంతో పాటు కనీస రక్త నష్టం, తగ్గిన మచ్చలు మరియు శస్త్రచికిత్స అనంతర ఆసుపత్రి బస తక్కువ గా ఉండటం వంటి అదనపు ప్రయోజనాలను కలిగిస్తున్నాము , రోగులను వేగంగా కోలుకునేలా చూస్తున్నాము ” అని అన్నారు.“ఈ అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా, మేము మెరుగైన ఖచ్చితత్వంతో సంక్లిష్టమైన యూరాలజికల్ శస్త్రచికిత్సలను కూడా చేయగలుగుతున్నాము. 3D హై-డెఫినిషన్ విజువలైజేషన్ అసమానమైన రీతిలో స్పష్టత మరియు దృక్పథాన్ని లోతుగా అందిస్తుంది. పలితంగా మెరుగైన రీతిలో నియంత్రణ సామర్థ్యాన్ని మరియు సున్నితమైన నిర్మాణాలతో కూడిన యూరాలజికల్ వ్యవస్థలోని సంక్లిష్ట శస్త్రచికిత్సా విధానాలకు మెరుగైన ఫలితాలను అందిస్తుంది.
