శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన… కర్నూలు రేంజ్ డీఐజీ
1 min read
డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ , నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ .
శ్రీశైలం, న్యూస్ నేడు: శ్రీశైలంలో జరుగుచున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన భద్రత చర్యలను నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ తో కలిసి కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఐపీఎస్ పరిశీలించారు.శ్రీశైలం దేవస్థానంలోని క్యూ లైన్ లు ,గుడి పరిసరాలు పరిశీలించారు. cc కెమెరాల కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల భద్రత చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కర్నూల్ రేంజ్ డీఐజీ తో పాటు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ , డీఎస్పీ రామాంజి నాయక్ ఉన్నారు.