NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మార్చి 1 నుంచి శ్రీ గురు రాఘవేంద్ర వైభవోత్సవాలు..మంత్రి నారా లోకేష్ రాక

1 min read

మార్చి 1 న 404 వ పట్టాభిషేక మహోత్సవం

6 న 430 వ వర్ధంతి వేడుకలు

మంత్రాలయం న్యూస్​ నేడు :  పవిత్ర తుంగభద్ర నది ఒడ్డున జీవసమాధి అయిన శ్రీ రాఘవేంద్రుని గురు వైభవోత్సవాలు మార్చి 1 తేదీ నుంచి 6 వ తేదీ వరకు శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించేందుకు మఠం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1 న పట్టాభిషేక మహోత్సవం, 6 న వర్ధంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మఠంలో ప్రత్యేక పూజలు రథోత్సవాలు వివిధ రంగాల్లో సేవలు అందించిన ప్రముఖులకు అవార్డుల ప్రదానం, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.మార్చి 1 న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురు వైభవోత్సవాల్లో పాల్గొనేందుకు వస్తున్నట్లు, టిడిపి జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు పన్నగ వెంకటేష్ స్వామి, మఠం అధికారులు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *