కొనసాగుతున్న భీరప్ప దేవర….
1 min read
అలకరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
మంత్రాలయం న్యూస్ నేడు : మండల పరిధిలోని చెట్నీహళ్లి గ్రామంలో వెలసిన శ్రీ భీరలింగేశ్వర స్వామి దేవరను ముడో రోజు మంగళవారం ఆలయ పూజార్ల ఆధ్వర్యంలో ఘనంగా పోంజోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున నుంచి చెట్నీహళ్లి గ్రామానికి చెందిన అళ్లింగప్ప, పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామానికి చెందిన యాతగిరప్ప, ఎమ్మిగనూరు మండలం మసీదుపురం గ్రామానికి చెందిన వన్నికెరప్ప స్వామి వార్ల భీరప్ప దేవాలయం కొలవై ప్రత్యేక పూజలు నిర్వహించారు .పోంజోత్సవం మరియు దొంగ వేషాలు, భీరప్ప, కామళమ్మ కళ్యాణం, గోరవయ్య కట్టలు, జంగం వేషాలు, సన్నాయి, మోళ తాళాలు, నృత్యాలు, ఆట పాటలతో దేవాలయం ముందు భాగంలో ఘనంగా నిర్వహించారు భక్తులు తమ మొక్కులు చెల్లించారు. దీంతో భీరప్ప ఆలయం భక్తులతో కిటకిట లాడింది.
