చిన్నచిన్న పరిశ్రమల ద్వారా జీవనోపాధి…
1 min read
మహానంది, న్యూస్ నేడు: చిన్నచిన్న పరిశ్రమల ద్వారా జీవనోపాధి లభిస్తుందని జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జవహర్ బాబు పేర్కొన్నారు. మండలంలోని బుక్కాపురం వద్ద ఉన్న స్రవంతి మండల ఐక్య పొదుపు భవనం నందు పొదుపు మహిళలకు ఏర్పాటుచేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల ద్వారా మహిళలు చిన్న చిన్న / కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడం వల్ల అభివృద్ధి పథంలో నడిచే అవకాశం ఉందన్నారు. చిన్న పరిశ్రమల పెద్ద పరిశ్రమలుగా అవతరించి అవకాశం లేకపోలేదు అన్నారు. మహిళా శక్తితో సాధించలేనిది ఏమీ లేదని శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పొదుపు మహిళలకు సూచించారు. పొదుపు సంఘాలకు ప్రభుత్వం చేయూత ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. ఉత్పత్తులను తయారు చేయడమే కాక మార్కెటింగ్ సౌకర్యం ఇతర అంశాలపై పొదుపు భవనంలో శిక్షణ ఇచ్చారు. బ్యాంకు రుణాలు పొందడం ఎలా అనే అంశంపై ఎల్ డి ఎం రవీంద్రబాబు శిక్షణలో పాల్గొన్న పొదుపు సంఘాల మహిళలకు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దౌలత్ ఏపీఎం తిరుపాల్ రెడ్డి ఐపిఓ చంద్రశేఖర్ వెలుగు ఏరియా కోఆర్డినేటర్ నాగేంద్ర ప్రసాద్ స్కిల్ డెవలప్మెంట్ నుండి హుస్సేన్ ,అస్లాం తదితరులు పాల్గొన్నారు.
