బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ మార్చి 1 నుంచి 3 వరకు మీ జీ తెలుగులో!
1 min read
కర్నూలు న్యూస్ నేడు: వరుస సూపర్హిట్ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్లతో ఫిక్షన్, నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తున్న జీ తెలుగు మరో త్రిపుల్ బొనాంజా ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వరల్డ్ టెలివిజ్ ప్రీమియర్గా ప్రసారం చేసేందుకు సిద్దమైంది. జీ తెలుగు 16 సీరియల్స్ పోటీపడే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, మధ్యతరగతి కుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టకునేలా రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్ని ప్రారంభించనుంది. సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1(శనివారం)న సాయంత్రం 6 గంటలకు, నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులు గా హాజరైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ లాంచ్ మార్చి 2(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు, ప్రేమ, బాధ్యత, బంధాలే ప్రధానంగా సాగే సరికొత్త సీరియల్ లక్ష్మీ నివాసం ప్రారంభం మార్చి 3(సోమవారం) రాత్రి 7 గంటలకు.. మీ జీ తెలుగులో!విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు వేదికగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం కానుంది. జీ తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాన్-ఫిక్షన్ షోలలో ఒకటైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఎపిసోడ్కి ప్రముఖ నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు అతిథులుగా హాజరై మరింత వినోదాన్ని అందించనున్నారు. యాంకర్ రవి, అషు రెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.అంతేకాదు, ఆసక్తికరమైన మలుపులతోసాగే సీరియల్స్తో ఆకట్టుకుంటున్న జీ తెలుగు మరో అద్భుతమైన కథతో రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్ని ప్రారంభించబోతోంది. సాధారణ మధ్యతరగతికి చెందిన లక్ష్మి, శ్రీనివాస్ ల ప్రేమకథ ఆధారంగా ఈ సీరియల్ తెరకెక్కుతోంది. ఈ అందమైన కుటుంబ ప్రయాణం గురించి మరింత తెలుసుకోవాలంటే మార్చి 3 సోమవారం నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే లక్ష్మీ నివాసం సీరియల్ మిస్కాకుండా చూసేయండి.