ఎస్ సి వర్గీకరణ సాధనలో మంద కృష్ణ మాదిగ పునరాలోచించాలి
1 min read
రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు హితవు
రాజ్యసభ నిధుల నుండి 40 లక్షలు మంజూరు చేయాలని వినతి
ఏలూరు జిల్లా న్యూస్ నేడు: ఏలూరులో ఎస్ సి సంఘాల జే.ఏ.సి ఆద్వర్యం లో నిర్వహించిన ఎస్ సి వర్గీకరణ సమీక్షా సమావేశం లో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మాలలకు, మాదిగలకు కూడా సముచిత స్థానం కల్పించారన్నారు, అలాగే ఎస్సీ వర్గీకరణలో మందకృష్ణ మాదిగ పురాలోచన చేసుకోవాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఊదరగొండీ చంద్రమౌళి, పళ్ళెం ప్రసాద్, మెండెం సంతోష్,నూకపేయ్యి సుధీర్,కార్తీక్,తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఏలూరు నగరం లో నిర్మిస్తున్న మాల భవనానికి రాజ్యసభ సభ్యుని నిధులనుండి 40 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయాలని ఎస్ సీ సంఘాల జే ఏ సి నేతలు గొల్ల బాబురావు కి వినతి పత్రం అందజేశారు.