ఏలూరు జిల్లా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు
1 min read
జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్
బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంవద్ద భద్రత ఏర్పాట్లు, పోలీసు బందోబస్తు సమీక్ష
ఏలూరు ప్రతినిధి న్యూస్ నేడు :శివరాత్రి సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శైవ క్షేత్రాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లా ఎస్పీ బలివే గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, అలాగే పోలవరం పట్టిసీమలోని శ్రీ వీరేశ్వర స్వామి ఆలయాలను ప్రత్యక్షంగా సందర్శించారు. భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తును సమీక్షించారు. ఆలయ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలీస్ కంట్రోల్ రూమ్ ద్వారా డ్రోన్, సీసీటీవీల పర్యవేక్షణ కొనసాగిస్తూ భద్రతా ఏర్పాట్లను మెరుగుపరచాలని సూచించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. దర్శనార్థం వచ్చే భక్తుల కోసం క్యూ లైన్లు పక్కాగా నిర్వహించాలి.ఆలయ ప్రవేశం, బయటికి వెళ్లే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు కచ్చితంగా అమలు చేయా అన్నారు. వాహనాలు పార్కింగ్ చేసేందుకు ప్రత్యేక స్థలాలను క్రమబద్ధంగా ఏర్పాటు చేయాలి, ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలన్నారు.భక్తుల రద్దీని పర్యవేక్షిస్తూ, పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా ఇటు భక్తులకు అటు సిబ్బందికి అవసరమైన సూచనలు, సలహాలు అందించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను అమలు చేయాలని, మహాశివరాత్రి వేడుకలు ప్రశాంతంగా, భక్తులందరికీ అనుకూలంగా జరిగేలా పోలీసు అధికారులు కృషి చేయాలని జిల్లా ఎస్పీ ఆదేశించారు. కార్యనిర్వహణాధికారి కార్యక్రమాలను పరివేక్షించారు.
