హరిహోం శివ శివ శంభో శంకర…
1 min read
మంత్రాలయం, న్యూస్ నేడు: మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివాలయాలు హరి హోం శివ శివ శంభో శంకర అంటు నామస్మరణం తో మారుమ్రోగాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రాలయం లో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అర్చకుల అధ్వర్యంలో తెల్లవారుజామున నుండి రుద్రాభిషేకం, క్షీరాభిషేకం వంటి పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. అలాగే మండల పరిధిలోని రాంపురం రామలింగేశ్వర స్వామి దేవాదాయం లో వైకాపా జిల్లా ఉపాధ్యక్షులు ప్రదీప్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ గ్రామాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. దీంతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది.
