ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రధానం
1 min read
ఎన్నికల సామాగ్రి అంతా సరిచూచుకోవాలి
ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ప్రధానమైనదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు. బుధవారం స్ధానిక గిరిజన భవన్ లో ఏర్పాటు చేసిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టభధ్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంనకు సంబంధించి ఎన్నికల పోలింగ్ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ తీసుకున్న పోలింగ్ అధికారులను, సిబ్బందిని ఎన్నికల సామాగ్రి అంతా తీసుకున్నారా లేదా అని ఒక్కోక్క మెటీరియల్ ను అడిగి చూపించమని వాటిని పరిశీలించారు. చెక్ లిస్టు ప్రకారం ఎన్నికల సామాగ్రిని అంతా సరిచూచుకోవాలన్నారు. బ్యాలెట్ బాక్సుల పనితీరును పరిశీలించుకోవాలన్నారు. ఎన్నికల విధులకు నియమించిన సిబ్బంది అందరూ హాజరయ్యారాలేదా అని ఏలూరు ఆర్డివో అచ్యుత అంబరీష్ ను ఆరా తీసారు. ఎన్నికల విధులకు ఎవరైనా హాజరుకాకపోతే ఎన్నికల నిబందనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీస్ సిబ్బందికి ఎక్కడ డ్యూటీలు వేశాలో అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ పేపర్లను క్షుణంగా పరిశీలించుకోవాలన్నారు. వాటిని ఏవిధంగా మడిచి బ్యాలెట్ బాక్సులో ఓటరు వేసే విషయంపై అవగాహన కల్పించారు. ఇప్పటికే ఈవిషయంపై శిక్షణ కూడా అందించడం జరిగిందన్నారు. పోలింగ్ నిర్వహించే తీరును పోలింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు చేరిన పిదప అక్కడ పోలింగ్ ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. పోలింగ్ నిర్వహణలో ఏమైనా సందేహాలు ఉన్నాయా అని పోలింగ్ సిబ్బందిని అడిడి తెలుసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల నిర్వహణకు అందరూ సమర్ధవంతంగా పనిచేయాలని ఈ సందర్బంగా కలెక్టర్ పోలింగ్ సిబ్బందికి సూచించారు. ప్రతి రూట్ కు ఒక సెక్టార్ ఆఫీసరు, ఒక జోనల్ ఆఫీసరు ఉంటారని వీరికి పోలింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు ఆర్ టిసి బస్సులో పకడ్బందీగా పోలీస్ బంధోబస్తుతో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారన్నారు. అదే విధంగా ఈ ఎన్నికలకు సంబంధించి జంగారెడ్డిగూడెం ఆర్డివో కార్యాలయంలో మరో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. అదే విధంగా కృష్ణా-గుంటూరు పట్టభధ్రుల నియోజకవర్గానికి సంబంధించి నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ వెంట ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, తహశీల్దారు శేషగిరి తదితరులు ఉన్నారు.
