అంగరంగ వైభవంగా ఆశ్రంలో మెడికల్ కాలేజ్ ‘డే’ వేడుకలు
1 min read
ఆశ్ర0లో నిష్ణాతులైన వైద్యులచే ప్రజలకు నాణ్యమైన వైద్యం
ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలు విద్యార్థులకు జ్ఞాపికలు అందజేత
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఆశ్రం వైద్య కళాశాల మంగళవారం కాలేజి డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆశ్రం ప్రాంగణం నందు మెడికల్ విద్యార్థులు పలు సాంస్కృతి కార్యక్రమాలతో ఘనముగా నిర్వహించారు. కళాశాల ప్రారంభించి 25 సం పూర్తయినదని,ఆశ్రం వైద్య కళాశాల ద్వారా ఎంతో మంది విద్యార్థులు వివిధ విభాగములలో నిష్ణాతులై ప్రపంచ నలుమూలలా వైద్య సేవలు అందించడం మాకు ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఆశ్రం విద్యా సంస్థల అధినేత డా: గోకరాజు గంగరాజు తొలినాళ్ళలో కాలేజి వ్యవస్థను ఏర్పాటు చేయడంలో సాహసోపేతమైన సవాళ్ళను గురించి, వాటిని అధిగమించి నాటి నుండి నేటి వరకు ప్రజలకు ఎటువంటి సౌకర్యాలను కలుగకుండా, వైద్య సేవలను అందించడం అభినందనీయమన్నారు. అధికారులు, వైద్యులు, సిబ్బంది సహకారం మరువలేనిదని ఈ సందర్భముగా తెలియజేసారు. వైద్య విద్యను అందించడంలో వివిధ ప్రాంతాల నుండి నిష్ణాతులైన వైద్యులను నియమించి వారి ద్వారా నాణ్యమైన వైద్య విద్యను, వైద్య సేవలను అందజేయగలిగామని తెలియజేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డా: ఎన్.టి.ఆర్ హెల్త్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ డా:డి.ఎస్.వి.ఎల్. నరసింహం హజరై ఆశ్రం కళాశాలలో ఎంతోమంది ప్రతిభావంతులైన విద్యార్థుల కర్మాగారం అని, క్షేత్రస్థాయిలో సామాన్యునికి వైద్య విద్య అందించడంలో ఎంతో కృషి చేస్తోందని తెలియజేసారు. మెడికల్ కాలేజిగా ఎన్.ఎ.జి.హెచ్.ఎన్.ఎ.బి.ఎల్. మరియు న్యాక్ గుర్తింపు కలిగి ఉండటం ఆశ్రం మెడికల్ కాలేజి పాటిస్తున్న ప్రమాణాలకు నిదర్శనమని ఈ సందర్భముగా అభినందనలు తెలియజేసారు. కాలేజీ ప్రిన్సిపల్ డా:చేబ్రోలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతింతై, వటుడింతై అన్నట్లు, ఆశ్రం విద్యా సంస్థలు తమ విద్యార్థులకు నాణ్యమైన, విలువలతో కూడిన వైద్య విద్యను అందిస్తున్నామని. ఎప్పటికప్పుడు నూతన విధానాలను అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తున్నామని ప్రతి ఒక్కరికీ వైద్యం అందించడమే తమ లక్ష్యం అని తెలియజేసారు. హాస్పిటల్ ముఖ్య పరిపాలనాధికారి డా: కె హనుమంతరావు మాట్లాడుతూ ఆశ్రం మెడికల్ కాలేజి ఆశ్రం నర్సింగ్ కాలేజి, పారామెడికల్ కాలేజి ద్వారా వివిధ విభాగాలలో ప్రతిఏటా వందల మంది విద్యార్థులను తయారుచేసి సమాజానికి అందిస్తున్నామని, వ్యాపార ధృక్పదంకు అతీతముగా సామాజిక బాధ్యతగా ఈ సేవలు అందజేయడం జరుగుతోందని, స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో పాటు క్యాన్సర్ సేవలు కూడా అందజేయడం చాలా సంతృప్తిని కలిగిస్తోందని ఇటువంటి సదుపాయాల కల్పనకు, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ఛైర్మన్ డా:గోకరాజు గంగరాజు కి ధన్యవాదాలు తెలియజేసారు.కాలేజి డే సందర్భముగా ఉత్తమ ప్రతిభ కనిపించిన పలువురు విద్యార్థులకు అభినందనలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆశ్రం సంస్థల ముఖ్య పరిపాలనాధికారి డా: హనుమంతురావు, కళాశాల ప్రిన్సిపల్ డా:చేబ్రోలు శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపల్ డా: వేణుగోపాల రాజు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్: శాంతయ్య మరియు వైద్యులు,వైద్య సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.