సమస్యల పరిష్కారం కోసమే ఉద్యోగుల కమిటీ..
1 min read
నూతన తాలూకా అధ్యక్షులుగా నర్సరాజు..
నందికొట్కూరు న్యూస్ నేడు : ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే ఉద్యోగుల నూతన కమిటీలను ఎన్నుకున్నట్లు ఉద్యోగుల సంఘం నందికొట్కూరు తాలూకా నూతన అధ్యక్షులు రాగిని నరసరాజు అన్నారు. తాలూకా అధ్యక్షులుగా బ్రాహ్మణకొట్కూరు వీఆర్వో నర్సరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఏపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కార్యవర్గ సమావేశం నంద్యాల జిల్లా అధ్యక్షులు కె.నాగేంద్రప్ప ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో నందికొట్కూరు తాలుకా అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు కె.బాలరాజు వ్యక్తిగత కారణాల వల్ల అధ్యక్ష పదవి నుండి తప్పుకోవడం జరిగిందని అందువల్ల నూతన కమిటీని ప్రకటించినట్లు వారు తెలిపారు.జిల్లా అధ్యక్షులు నాగేంద్రప్ప నూతన కమిటీ పేర్లను ప్రకటించారు.ఉపాధ్యక్షురాలిగా ఉన్న పి.భువనేశ్వరిని కార్యదర్శిగా, నల్లబోతుల మద్దిలేటి ఉపాధ్యక్షుడుగా..సంక్షేమ శాఖ నుంచి సిరాజ్ అహ్మద్,వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీ పి.జాకీర్ హుస్సేన్ సంయుక్త సహాయకులుగా ఎన్నిక అయ్యారు.ఈ సమావేశానికి నంద్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె నాగేంద్రప్ప మరియు తిరుపాలయ్య మరియు నంద్యాల సిటీ అధ్యక్షులు సత్యం, నందికొట్కూరు తాలుకా కోశాధికారి రాముడు, కార్యవర్గ సభ్యులు నందికొట్కూరు నియోజక వర్గంలోని గ్రామ రెవిన్యూ అధికారులు,ఉద్యోగులు పాల్గొన్నారు.