శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: నగరంలోని తన నివాసంలో జరిగిన కార్యక్రమంలో మార్చి నెల రెండవ తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు జరగనున్న గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాల ప్రచారం పోస్టర్లను, ఆహ్వాన పత్రికలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు మారం నాగరాజు గుప్తా, సభ్యులు శేష ఫణి, భూమా కృష్ణ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా గోదా రంగనాయకి సమేత శ్రీ రంగనాథ స్వామి ఆలయ కమిటీ అధ్యక్షుడు మారం నాగరాజు గుప్తా మాట్లాడుతూ మార్చి రెండవ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఆలయ రెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందుకు సంబంధించిన ప్రచార వాల్పోస్టర్లను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారని వెల్లడించారు .ఈ వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రంగనాథ స్వామి వారి ఆశీస్సులు పొందాలని వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే ప్రతిరోజు ఉదయం, రాత్రి వాహన సేవా కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు.