ముగిసిన అంగన్వాడి ఇంటర్వ్యూలు
1 min read
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, న్యూస్ నేడు: ఆదోని డివిజన్ పరిధిలో అంగన్వాడి ఇంటర్వ్యూలు ముగుసాయని ఆదోని డివిజన్ సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు. శుక్రవారం ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో ఆదోని డివిజన్ సంబంధించి అంగన్వాడి ఇంటర్వ్యూలు నిర్వహణ జరిగాయి. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… డివిజన్లో అంగన్వాడి వర్కర్స్ 6 ఖాళీలకు ఉండగా 25 మంది దరఖాస్తు చేసుకున్నారు 23 మంది హాజరు అవ్వగా, ఇద్దరు గైహార్జరు అయ్యారు, అంగన్వాడి హెల్పర్స్ 40 ఖాళీలు ఉండగా 174 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 154 మంది అభ్యర్థులు హాజరుఅవ్వగా, 20 గైహార్జరు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐ.సి.డి.ఎస్ ప్రాజక్ట్ డైరెక్టర్ నిర్మల దేవి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, సిడిపివోలు ఉమామహేశ్వరి, సఫర్నిషా బేగం, నాగమణి, శశికళ, తదితరులు పాల్గొన్నారు.
