ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్..ఎం.పి బస్తిపాటి నాగరాజు
1 min read
కర్నూలు , న్యూస్ నేడు: అభివృద్ధి ఫలాలు అందరికి అందేలా బడ్జెట్లో కేటాయింపులు చేశారని ఎం.పి బస్తిపాటి నాగరాజు అన్నారు..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఆయన తన కార్యాలయంలో హర్షం వ్యక్తం చేశారు.. కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ను అద్భుతంగా ప్రవేశపెట్టిందన్నారు.. బడ్జెట్లో రాష్ట్ర అభివృద్ధి , సంక్షేమంతో పాటు ఎన్నికల మేనిఫెస్టో హామీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు.. సూపర్ సిక్స్ పథకాలలో భాగమైన తల్లికి వందనం, అన్నదాత సుఖిభవ, పించన్ల కు బడ్జెట్లో నిధులు కేటాయించడం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి నిదర్శమన్నారు..ఇక బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం సంతోషంగా ఉందని ఎం.పి తెలిపారు.