అన్ని రంగాలలో సమతూకంతో మేళవింపు చేసిన సమ్మిళిత బడ్జెట్
1 min read
ఏపీ బడ్జెట్ 2025-2026 కేటాయింపులు వృద్ది, అభివృద్ది & సంక్షేమం కలబోసిన సమ్మిళిత బడ్జెట్ @2047 వికసిత భారత్ వికసిత ఆంధ్ర లక్ష్యం రోడ్ మ్యాప్ బడ్జెట్:
కొట్టె మల్లికార్జున బిజెపి యువ నాయకులు
కర్నూలు , న్యూస్ నేడు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో 2025-2026 సంవత్సరంకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ రికార్డు స్థాయిలో 3,22,359 లక్షల బడ్జెట్ ను అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడం జరిగింది. ఇందులో రెవెన్యూ వ్యయం గా 2,51,162 కోట్లు, మూలధనం వ్యయం 40,635 కోట్లు,రెవెన్యూ లోటు 33, 185 కోట్లు, ద్రవ్య లోటు 79, 926కోట్లు గా పేర్కొనడం జరిగింది. పూర్వ సివిల్స్ విద్యార్థి మరియు బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో మాట్లాడుతూ ఏపీ 2025-2026 బడ్జెట్ కేటాయింపులు చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో వికసిత భారత్ వికసిత ఆంధ్ర లక్ష్యంగా వృద్ది, అభివృద్ది, సంక్షేమం దిశగా పేద మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సక్రమంగా జరగడానికి అన్ని రకాల వర్గాలకు,అన్ని రంగాలలో సమతూకంతో మేళవింపు చేసిన సమ్మిళిత బడ్జెట్ అని మీడియాతో పేర్కొన్నారు. ముఖ్యంగా బీసీల సంక్షేమానికి 47,456 కోట్లు , సాంఘిక సంక్షేమంకు 10,909 కోట్లు, ఈబిసీ వర్గాలకు 10,619 కోట్లు, మైనారిటీలకు 5,434 కోట్లు,వైద్య ఆరోగ్యశాఖకు 19,265 కోట్లు కేటాయించడమే కాకుండా ప్రతి కుటుంబానికి 25 లక్షలతో కూడిన ఆరోగ్య భీమా,విద్యుత్ శాఖకు 13,600 కోట్లు, ఎస్సీలకు 20,281 కోట్లు,ఎస్టీలకు 8,159కోట్లు,విద్యారంగానికి 34,312 కోట్లు, పురపాలక పట్టణ అభివృద్ధికి 13,862 కోట్లు, జలవనరుల శాఖకు చెందిన సాగునీరు,పొలవరం ప్రాజెక్ట్ కు 18,019 కోట్లు , పంచాయతీ రాజ్ కు 18,847 కోట్లు, జల్ జీవన్ మిషన్ కింద 2800కోట్లు, గృహ నిర్మాణంకు 6,318కోట్లు, పౌర సరఫరాలకు 3,806 కోట్లు, మహిళలు, వృద్దులకు,దివ్యంగులకు 4,332కోట్లు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ బడ్జెట్ ను 48,341 కోట్లతో మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టగా అత్యధిక కేటాయింపులు వ్యవసాయం, అనుబంధ రంగాలకు 11,636 కోట్లు కేటాయించారు అని పేర్కొన్నారు. అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలులో భాగంగా రైతులకు గిట్టుబాటు ధరల స్థిరీకరణ నిధి కోసం 300కోట్లతో పాటు, అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఏడాదికి కేంద్ర సహాయం పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో కలుపుకొని ప్రతి రైతుకు ఇరవై వేలు ఇచ్చే విధంగా 6,300కోట్లు , దీపం పథకం కింద 2,601కోట్లు, వృద్దులు, ఒంటరి మహిళలు, వికలాంగుల పెన్షన్లు కోసం 27,518కోట్లు, తల్లికి వందనం కింద 9,407 కోట్లు కేటాయింపులు చేస్తూ, వికసిత భారత్ వికసిత స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యం సాధించే దిశగా రెండున్నర ట్రిల్లియన్ డాలర్లు, అలాగే తలసరి ఆదాయంలో 43,000 డాలర్లు లక్ష్యంగా,యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ బడ్జెట్ కేటాయింపులు జరిగాయి అని తెలుపుతూ, ఎన్డీఏ కూటమి కేంద్రం, రాష్ట్రం డబుల్ ఇంజన్ సర్కార్ కృషితో రాబోయే రోజుల్లో డబుల్ ఇంజన్ వృద్ది రేటు,అభివృద్ది సాధించే రాష్ట్రంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా ఎదుగుతుందని నమ్మకం ఉందని బిజెపి యువ నాయకులు కొట్టె మల్లికార్జున మీడియాతో పేర్కొన్నారు.